కీర్తనల గ్రంథము 39 : 1 (ERVTE)
“నేను జాగ్రత్తగా నడచుకొంటాను. [QBR2] నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను. [QBR2] నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను. [*నా నోరు మూసుకొంటాను అక్షరాల నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.]
కీర్తనల గ్రంథము 39 : 2 (ERVTE)
మాట్లాడుటకు నేను తిరస్కరించాను. [QBR2] నేనేమి చెప్పలేదు. [QBR2] కానీ నేను నిజంగా తల్లడిల్లిపోయాను. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 3 (ERVTE)
నాకు కోపం వచ్చింది. [QBR2] దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది. [QBR2] కనుక నేను ఏదో అన్నాను.
కీర్తనల గ్రంథము 39 : 4 (ERVTE)
యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము. [QBR2] నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము. [QBR2] నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 5 (ERVTE)
యెహోవా నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు. [QBR2] నా జీవితం నీ ఎదుట శూన్యం. [QBR] ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
కీర్తనల గ్రంథము 39 : 6 (ERVTE)
మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది. [QBR2] మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. [QBR2] కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
కీర్తనల గ్రంథము 39 : 7 (ERVTE)
కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది? [QBR2] నీవే నా ఆశ. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 8 (ERVTE)
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు. [QBR2] దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 9 (ERVTE)
నేను నా నోరు తెరవను. [QBR2] నేను ఏమీ చెప్పను. [QBR2] యెహోవా, నీవు చేయవలసింది చేశావు. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 10 (ERVTE)
దేవా, నన్ను శిక్షించటం మానివేయుము. [QBR2] నీ శిక్షవల్ల నేను అలసిపోయాను. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 11 (ERVTE)
యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు. [QBR2] వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు. [QBR2] మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 39 : 12 (ERVTE)
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. [QBR2] నేను నీకు మొరపెట్టే మాటలు వినుము. [QBR2] నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు. [QBR] నేను దాటిపోతున్న ఒక అతిథిని. [QBR2] నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని. [QBR]
కీర్తనల గ్రంథము 39 : 13 (ERVTE)
యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము. [QBR2] కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: