కీర్తనల గ్రంథము 4 : 1 (ERVTE)
నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము. [QBR2] నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము! [QBR2] ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము. [*తొలగించుము అక్షరార్థముగా ‘నాకు గదిని ఇమ్ము.’]
కీర్తనల గ్రంథము 4 : 2 (ERVTE)
ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు? [QBR2] ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
కీర్తనల గ్రంథము 4 : 3 (ERVTE)
యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు. [QBR2] నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 4 : 4 (ERVTE)
మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు. [QBR2] కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 4 : 5 (ERVTE)
దేవునికి మంచి బలులు అర్పించండి. [QBR2] మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
కీర్తనల గ్రంథము 4 : 6 (ERVTE)
“దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు? [QBR2] యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 4 : 7 (ERVTE)
యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందు చేత పంట కోత సమయంలో సంబరపడే దాని కంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము. [QBR]
కీర్తనల గ్రంథము 4 : 8 (ERVTE)
నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను. [QBR2] ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: