కీర్తనల గ్రంథము 46 : 1 (ERVTE)
దేవుడు మా ఆశ్రయం, మా శక్తి. [QBR2] ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 2 (ERVTE)
అందుచేత భూమి కంపించినప్పుడు, [QBR2] మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 3 (ERVTE)
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను, [QBR2] భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
కీర్తనల గ్రంథము 46 : 4 (ERVTE)
ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి, [QBR2] మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 5 (ERVTE)
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు. [QBR2] సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 6 (ERVTE)
రాజ్యాలు భయంతో పణకుతాయి. [QBR2] యెహోవా కేక వేయగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 7 (ERVTE)
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. [QBR2] యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
కీర్తనల గ్రంథము 46 : 8 (ERVTE)
చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి. [QBR2] ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి. [QBR]
కీర్తనల గ్రంథము 46 : 9 (ERVTE)
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు. [QBR2] సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
కీర్తనల గ్రంథము 46 : 10 (ERVTE)
దేవుడు చెబతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకోనండి. [QBR2] రాజ్యాలతో నేను స్తుతించబడతాను. [QBR2] భూమిమీద మహిమపర్చబడతాను.”
కీర్తనల గ్రంథము 46 : 11 (ERVTE)
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు. [QBR2] యాకోబు దేవుడు మనకు ఆశ్రయం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: