కీర్తనల గ్రంథము 55 : 1 (ERVTE)
దేవా నా ప్రార్థన వినుము. దయచేసి నాకు విముఖుడవు కావద్దు.
కీర్తనల గ్రంథము 55 : 2 (ERVTE)
దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము. నా ఇబ్బందులు నీతో చెప్పుకోనిమ్ము.
కీర్తనల గ్రంథము 55 : 3 (ERVTE)
నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను. నా శత్రువులు కోపముతో నా మీద దాడి చేశారు. వారు నా మీదకు కష్టాలు విరుచుకు పడేటట్టు చేసారు.
కీర్తనల గ్రంథము 55 : 4 (ERVTE)
నాలో నా గుండె ఆదురుతోంది . నాకు చచ్చి పోయేటంత భయంగా ఉంది.
కీర్తనల గ్రంథము 55 : 5 (ERVTE)
నాకు భయము మరియు వణకుగా ఉంది. నేను భయపడిపోయాను.
కీర్తనల గ్రంథము 55 : 6 (ERVTE)
ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది. నేను ఎగిరిపోయి విశ్రాంతి స్థలం వెతుక్కుందును కదా.
కీర్తనల గ్రంథము 55 : 7 (ERVTE)
నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.
కీర్తనల గ్రంథము 55 : 8 (ERVTE)
నేను పరుగెత్తి పోదును. నేను తప్పించుకొని పారిపోదును. ఈ కష్టాల తుఫాను నుండి నేను పారిపోదును.
కీర్తనల గ్రంథము 55 : 9 (ERVTE)
నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము. ఈ పట్టణంలో చాలా బలాత్కారం పోట్లాటలను నేను చూస్తున్నాను.
కీర్తనల గ్రంథము 55 : 10 (ERVTE)
పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి. ఈ పట్టణంలో దారుణమైన సంగతులు జరుగుతున్నాయి.
కీర్తనల గ్రంథము 55 : 11 (ERVTE)
వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది. ఎక్కడ చూచినా మనుష్యులు అబద్ధాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు.
కీర్తనల గ్రంథము 55 : 12 (ERVTE)
ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే దానిని నేను భరించగలను. ఒకవేళ నా శత్రువులు నాపై దాడిచేస్తే నేను దాక్కోగలను.
కీర్తనల గ్రంథము 55 : 13 (ERVTE)
కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు, నాకు తగినవాడవు, నా సహవాసివి, నా దగ్గర స్నేహితుడివి. నీవే నాకు కష్టాలు కలిగిస్తున్నావు.
కీర్తనల గ్రంథము 55 : 14 (ERVTE)
మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము. దేవుని ఆలయంలో మనము కలిసి సహవాసంలో నడిచాము.
కీర్తనల గ్రంథము 55 : 15 (ERVTE)
నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను. వారు సజీవంగానే సమాధి చేయబడ్తారని ఆశిస్తాను. ఎందుచేతనంటే వారు తమ ఇండ్లలో అలాంటి దారుణ విషయాలకు పథకాలు వేస్తారు.
కీర్తనల గ్రంథము 55 : 16 (ERVTE)
నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను. యెహోవా నాకు జవాబు ఇస్తాడు.
కీర్తనల గ్రంథము 55 : 17 (ERVTE)
సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను. ఆయన నా మాట వింటాడు.
కీర్తనల గ్రంథము 55 : 18 (ERVTE)
నేను చాలా యుద్ధాలు చేశాను. కానీ దేవుడు నన్ను రక్షిస్తాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వస్తాడు.
కీర్తనల గ్రంథము 55 : 19 (ERVTE)
దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు. నా మొర వింటాడు. ఆయన నా శత్రువులను ఓడిస్తాడు. నా శత్రువులు వారి బతుకులు మార్చుకోరు. వారు దేవునికి భయపడరు, గౌరవించరు.
కీర్తనల గ్రంథము 55 : 20 (ERVTE)
నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు. అతడు తన ఒప్పందాన్ని నిలబెట్టుకోలేదు.
కీర్తనల గ్రంథము 55 : 21 (ERVTE)
అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు. కాని నిజానికి వాడు యుద్ధం తలపెడతాడు. వాని మాటలు నూనె అంత నునుపుగా ఉంటాయి కాని ఆ మాటలు కత్తిలా కోస్తాయి.
కీర్తనల గ్రంథము 55 : 22 (ERVTE)
నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
కీర్తనల గ్రంథము 55 : 23 (ERVTE)
కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: