కీర్తనల గ్రంథము 6 : 1 (ERVTE)
యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. [QBR2] కోపగించి నన్ను శిక్షించవద్దు. [QBR]
కీర్తనల గ్రంథము 6 : 2 (ERVTE)
యెహోవా, నా మీద దయ ఉంచుము. [QBR2] నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి. [QBR2]
కీర్తనల గ్రంథము 6 : 3 (ERVTE)
నా శరీరం మొత్తం వణకుతోంది. [QBR] యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.? [QBR]
కీర్తనల గ్రంథము 6 : 4 (ERVTE)
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. [QBR2] నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 6 : 5 (ERVTE)
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. [QBR2] చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
కీర్తనల గ్రంథము 6 : 6 (ERVTE)
యెహోవా, రాత్రి అంతా, [QBR2] నిన్ను ప్రార్థించాను. [QBR] నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. [QBR2] నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుచున్నాయి. [QBR] నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 6 : 7 (ERVTE)
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. [QBR2] ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. [QBR2] ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను అలసటగాను ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 6 : 8 (ERVTE)
చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! [QBR2] ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక. [QBR]
కీర్తనల గ్రంథము 6 : 9 (ERVTE)
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
కీర్తనల గ్రంథము 6 : 10 (ERVTE)
నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు. [QBR2] వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు. [PE]
❮
❯