కీర్తనల గ్రంథము 67 : 1 (ERVTE)
దేవా మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము.
కీర్తనల గ్రంథము 67 : 2 (ERVTE)
దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము. నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
కీర్తనల గ్రంథము 67 : 3 (ERVTE)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక ! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
కీర్తనల గ్రంథము 67 : 4 (ERVTE)
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
కీర్తనల గ్రంథము 67 : 5 (ERVTE)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
కీర్తనల గ్రంథము 67 : 6 (ERVTE)
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము. మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
కీర్తనల గ్రంథము 67 : 7 (ERVTE)
దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: