కీర్తనల గ్రంథము 76 : 1 (ERVTE)
యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు. [QBR2] దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 2 (ERVTE)
దేవుని ఆలయం షాలేములో [*షాలేము యెరూషలేముకు మరియొక పేరు. దాని అర్థము “సమాధానము.”] ఉంది. [QBR2] దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 3 (ERVTE)
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను, [QBR2] కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
కీర్తనల గ్రంథము 76 : 4 (ERVTE)
దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి [QBR2] తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 5 (ERVTE)
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు. [QBR2] వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది. [QBR2] బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకో లేకపోయారు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 6 (ERVTE)
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు. [QBR2] రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 7 (ERVTE)
దేవా, నీవు భీకరుడవు. [QBR2] నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 8 (ERVTE)
(8-9) యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. [QBR2] దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు. [QBR] పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు. [QBR2] భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 9 (ERVTE)
కీర్తనల గ్రంథము 76 : 10 (ERVTE)
దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు. [QBR2] నీవు నీ కోపం చూపిస్తావు. బతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
కీర్తనల గ్రంథము 76 : 11 (ERVTE)
ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు. [QBR2] ఇప్పుడు మీరు వాగ్దానం చేసిన దాన్ని ఆయనకు ఇవ్వండి. [QBR] అన్ని చోట్లనుండీ ప్రజలు తాము [QBR2] భయపడే దేవునికి కానుకలు తెస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 12 (ERVTE)
దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు. [QBR2] భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు. [PE]
❮
❯