కీర్తనల గ్రంథము 79 : 1 (ERVTE)
దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు. [QBR2] ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని ఆపవిత్రపరచి నాశనం చేసారు. [QBR2] యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 2 (ERVTE)
అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు. [QBR2] అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 3 (ERVTE)
దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు. [QBR2] మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువ బడలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 4 (ERVTE)
మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి. [QBR2] మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 5 (ERVTE)
దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా? [QBR2] బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా? [QBR]
కీర్తనల గ్రంథము 79 : 6 (ERVTE)
దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము. [QBR2] నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 7 (ERVTE)
ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి. [QBR2] వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 8 (ERVTE)
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము. [QBR2] త్వరపడి. నీ దయ మాకు చూపించుము. [QBR2] నీవు మాకు ఎంతో అవసరం. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 9 (ERVTE)
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. [QBR2] నీ స్వంత నామానికి నీవు మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. [QBR] మమ్మల్ని రక్షించుము. [QBR2] నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 10 (ERVTE)
“మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?” [QBR2] అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు. [QBR] దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము. [QBR2] నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 11 (ERVTE)
దయచేసి, ఖైదీల మూల్గులు వినుము! [QBR2] దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 12 (ERVTE)
దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము. [QBR2] ఆ ప్రజలు నిన్ను అవమానించిని సమయాలనుబట్టి వారిని శిక్షించుము. [QBR]
కీర్తనల గ్రంథము 79 : 13 (ERVTE)
మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. [QBR2] మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. [QBR2] దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: