కీర్తనల గ్రంథము 81 : 1 (ERVTE)
సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి. ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
కీర్తనల గ్రంథము 81 : 2 (ERVTE)
సంగీతం ప్రారంభించండి గిలక తప్పెట వాయించండి. స్వరమండలం, సితారాల శ్రావ్యంగా వాయించండి.
కీర్తనల గ్రంథము 81 : 3 (ERVTE)
నెలవంక నాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. పౌర్ణమినాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
కీర్తనల గ్రంథము 81 : 4 (ERVTE)
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం. ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
కీర్తనల గ్రంథము 81 : 5 (ERVTE)
ఈజిప్టునుండి యోసేపును దేవుడు తీసుకొనిపోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు. ఈజిప్టులో నేను గ్రహించని భాషవిన్నాను.
కీర్తనల గ్రంథము 81 : 6 (ERVTE)
దేవుడు ఇలా చెపుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను. నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
కీర్తనల గ్రంథము 81 : 7 (ERVTE)
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
కీర్తనల గ్రంథము 81 : 8 (ERVTE)
“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
కీర్తనల గ్రంథము 81 : 9 (ERVTE)
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను ఎవరినీ ఆరాధించవద్దు.
కీర్తనల గ్రంథము 81 : 10 (ERVTE)
నేను యెహోవాను, నేనే మీ దేవుడను. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే. ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు, నేను దానిని నింపుతాను.
కీర్తనల గ్రంథము 81 : 11 (ERVTE)
కాని నా ప్రజలు నా మాట వినలేదు. ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
కీర్తనల గ్రంథము 81 : 12 (ERVTE)
కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను. ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
కీర్తనల గ్రంథము 81 : 13 (ERVTE)
ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
కీర్తనల గ్రంథము 81 : 14 (ERVTE)
అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను. ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
కీర్తనల గ్రంథము 81 : 15 (ERVTE)
యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు, అందుచేత వారు శిక్షించబడతారు.
కీర్తనల గ్రంథము 81 : 16 (ERVTE)
దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు. తన ప్రజలకు తృప్తి కలిగెంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: