కీర్తనల గ్రంథము 83 : 1 (ERVTE)
దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు.
కీర్తనల గ్రంథము 83 : 2 (ERVTE)
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు. నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
కీర్తనల గ్రంథము 83 : 3 (ERVTE)
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 4 (ERVTE)
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము. అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబతున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 5 (ERVTE)
దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతోచేసిన ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
కీర్తనల గ్రంథము 83 : 6 (ERVTE)
[This verse may not be a part of this translation]
కీర్తనల గ్రంథము 83 : 7 (ERVTE)
[This verse may not be a part of this translation]
కీర్తనల గ్రంథము 83 : 8 (ERVTE)
అష్షూరు సైన్నం లోతు వంశస్థులతో చేరి, వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
కీర్తనల గ్రంథము 83 : 9 (ERVTE)
దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరానును, యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
కీర్తనల గ్రంథము 83 : 10 (ERVTE)
ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు. వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
కీర్తనల గ్రంథము 83 : 11 (ERVTE)
దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము. జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 12 (ERVTE)
దేవా, మేము నీ దేశం విడిచేందుకు ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
కీర్తనల గ్రంథము 83 : 13 (ERVTE)
గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 14 (ERVTE)
అగ్ని అడవిని నాశనం చేసినట్టు కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 15 (ERVTE)
దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము. సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
కీర్తనల గ్రంథము 83 : 16 (ERVTE)
దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
కీర్తనల గ్రంథము 83 : 17 (ERVTE)
దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గు పడునట్లు చేయుము. వారిని అవమానించి, నాశనం చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 18 (ERVTE)
అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసు కొంటారు. నీ పేరు యోహోవా అని వారు తెలుసుకొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు అని వారు తెలుసుకొంటారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: