కీర్తనల గ్రంథము 86 : 1 (ERVTE)
నేను నిరుపేద, నిస్సహాయుణ్ణి. యోహావా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
కీర్తనల గ్రంథము 86 : 2 (ERVTE)
యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు. నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు. నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 86 : 3 (ERVTE)
నా ప్రభువా నా మీద దయ చూపించుము. రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
కీర్తనల గ్రంథము 86 : 4 (ERVTE)
ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను. నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
కీర్తనల గ్రంథము 86 : 5 (ERVTE)
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
కీర్తనల గ్రంథము 86 : 6 (ERVTE)
యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే నా ప్రార్థనలు ఆలకించుము.
కీర్తనల గ్రంథము 86 : 7 (ERVTE)
యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
కీర్తనల గ్రంథము 86 : 8 (ERVTE)
దేవా, నీవంటివారు మరొకరు లేరు. నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
కీర్తనల గ్రంథము 86 : 9 (ERVTE)
ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు. వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
కీర్తనల గ్రంథము 86 : 10 (ERVTE)
దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు. నీవు మాత్రమే దేవుడవు.
కీర్తనల గ్రంథము 86 : 11 (ERVTE)
యెహోవా నీ మార్గాలు నాకు నేర్పించు నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను. నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా అతి ముఖ్యాంశంగా చేయుము.
కీర్తనల గ్రంథము 86 : 12 (ERVTE)
దేవా, నా ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
కీర్తనల గ్రంథము 86 : 13 (ERVTE)
దేవా నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
కీర్తనల గ్రంథము 86 : 14 (ERVTE)
దేవా, గర్విష్టులు నాపై పడుతున్నారు. కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
కీర్తనల గ్రంథము 86 : 15 (ERVTE)
ప్రభూ, నీవు, దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
కీర్తనల గ్రంథము 86 : 16 (ERVTE)
దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము. నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను. నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
కీర్తనల గ్రంథము 86 : 17 (ERVTE)
దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము. అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు. ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: