కీర్తనల గ్రంథము 90 : 1 (ERVTE)
ప్రభూవా, శాశ్వతంగా నీవే మా నివాసం. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 2 (ERVTE)
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు. [QBR2] దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
కీర్తనల గ్రంథము 90 : 3 (ERVTE)
మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా. [QBR2] తిరిగి రండని నీవు చెప్పుతావు. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 4 (ERVTE)
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి. [QBR2] గత రాత్రిలా అవి ఉన్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 5 (ERVTE)
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము. [QBR] మేము గడ్డిలా ఉన్నాము. [QBR2]
కీర్తనల గ్రంథము 90 : 6 (ERVTE)
ఉదయం గడ్డి పెరుగుతుంది. [QBR2] సాయంత్రం అది ఎండిపోయి వుంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 7 (ERVTE)
దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము. [QBR2] నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది! [QBR]
కీర్తనల గ్రంథము 90 : 8 (ERVTE)
మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు. [QBR2] దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 9 (ERVTE)
నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు. [QBR2] మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 10 (ERVTE)
మేము 70 సంవత్సరాలు జీవిస్తాము. [QBR2] బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము. [QBR] మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి. [QBR2] అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 11 (ERVTE)
దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు. [QBR2] కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 12 (ERVTE)
మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు [QBR2] నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 13 (ERVTE)
యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము. [QBR2] నీ సేవకులకు దయ చూపించుము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 14 (ERVTE)
ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. [QBR2] మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 15 (ERVTE)
మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు. [QBR2] ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 16 (ERVTE)
వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము. [QBR2] వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము. [QBR]
కీర్తనల గ్రంథము 90 : 17 (ERVTE)
మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. [QBR2] మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము. [PE]
❮
❯