రోమీయులకు 10 : 1 (ERVTE)
సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వరశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
రోమీయులకు 10 : 2 (ERVTE)
వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు.
రోమీయులకు 10 : 3 (ERVTE)
దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నరు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు.
రోమీయులకు 10 : 4 (ERVTE)
నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది. [PE][PS]
రోమీయులకు 10 : 5 (ERVTE)
ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు” [✡ఉల్లేఖము: లేవీ. 18:5; ద్వితీ. 30:12.]
రోమీయులకు 10 : 6 (ERVTE)
కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు?
రోమీయులకు 10 : 7 (ERVTE)
“అగాధంలోకి ఎవరు దిగుతారు?” [✡ఉల్లేఖము: ద్వితీ. 30:13.] అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు? [PE][PS]
రోమీయులకు 10 : 8 (ERVTE)
మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.” [✡ఉల్లేఖము: ద్వితీ. 30:14.] ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము.
రోమీయులకు 10 : 9 (ERVTE)
యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయిన వారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు.
రోమీయులకు 10 : 10 (ERVTE)
ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము. [PE][PS]
రోమీయులకు 10 : 11 (ERVTE)
లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మిన వానికి ఆశాభంగం కలుగదు.” [✡ఉల్లేఖము: యెషయా 28:16.]
రోమీయులకు 10 : 12 (ERVTE)
యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు.
రోమీయులకు 10 : 13 (ERVTE)
దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు” [✡ఉల్లేఖము: యోవేలు 2:32.] అని వ్రాయబడి ఉంది. [PE][PS]
రోమీయులకు 10 : 14 (ERVTE)
మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు?
రోమీయులకు 10 : 15 (ERVTE)
ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!” [✡ఉల్లేఖము: యెషయా 52:7.] [PE][PS]
రోమీయులకు 10 : 16 (ERVTE)
కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?” [✡ఉల్లేఖము: యెషయా 53:1.]
రోమీయులకు 10 : 17 (ERVTE)
తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది. [PE][PS]
రోమీయులకు 10 : 18 (ERVTE)
“వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది. [QBR2] వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.” కీర్తన 19:4
రోమీయులకు 10 : 19 (ERVTE)
“ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు: “జనాంగము కాని వారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను అర్థం [QBR2] చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.” ద్వితీ. 32:21]
రోమీయులకు 10 : 20 (ERVTE)
యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు: “నా కోసం వెదకని వాళ్ళు నన్ను కనుగొంటారు. [QBR] నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.” యెషయా 65:1] [PS]
రోమీయులకు 10 : 21 (ERVTE)
కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు: “అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న [QBR2] ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.” యెషయా 65:2] [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: