రోమీయులకు 15 : 1 (ERVTE)
సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేని వాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు.
రోమీయులకు 15 : 2 (ERVTE)
ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి.
రోమీయులకు 15 : 3 (ERVTE)
క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించిన వాళ్ళు నన్నూ అవమానించారు.”
రోమీయులకు 15 : 4 (ERVTE)
గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం.
రోమీయులకు 15 : 5 (ERVTE)
మనలో సహనము, ప్రోత్సాహము, కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక!
రోమీయులకు 15 : 6 (ERVTE)
అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి ఐనటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము.
రోమీయులకు 15 : 7 (ERVTE)
దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి.
రోమీయులకు 15 : 8 (ERVTE)
మూల పురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు.
రోమీయులకు 15 : 9 (ERVTE)
యూదులు కాని వాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను. [QBR2] నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.” కీర్తన 18:49
రోమీయులకు 15 : 10 (ERVTE)
మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! [QBR2] మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.” ద్వీతీయోపదేశ 32:43
రోమీయులకు 15 : 11 (ERVTE)
ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది: “యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి. [QBR2] ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!” కీర్తన 117:1
రోమీయులకు 15 : 12 (ERVTE)
యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు: “యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది. [QBR2] ఆయన దేశాలను పాలిస్తాడు. [QBR2] యూదులు కాని వాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.” యెషయా 11:10 [PS]
రోమీయులకు 15 : 13 (ERVTE)
రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది. [PS]
రోమీయులకు 15 : 14 (ERVTE)
{ఉద్దేశ్యం} [PS] సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది.
రోమీయులకు 15 : 15 (ERVTE)
అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా
రోమీయులకు 15 : 16 (ERVTE)
నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కాని వాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కాని వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు. [PE][PS]
రోమీయులకు 15 : 17 (ERVTE)
అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను.
రోమీయులకు 15 : 18 (ERVTE)
క్రీస్తు నా ద్వారా చేసిన వాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కాని వాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు.
రోమీయులకు 15 : 19 (ERVTE)
గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను.
రోమీయులకు 15 : 20 (ERVTE)
క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు.
రోమీయులకు 15 : 21 (ERVTE)
అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఆయన్ని గురించి చెప్పబడిన వాళ్ళు చూస్తారు. [QBR2] కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి వినని వాళ్ళు అర్థం చేసుకొంటారు.” యెషయా 52:15 [PS]
రోమీయులకు 15 : 22 (ERVTE)
{రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం} [PS] మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి. [PE][PS]
రోమీయులకు 15 : 23 (ERVTE)
ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను.
రోమీయులకు 15 : 24 (ERVTE)
నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. [PE][PS]
రోమీయులకు 15 : 25 (ERVTE)
కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను.
రోమీయులకు 15 : 26 (ERVTE)
ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు.
రోమీయులకు 15 : 27 (ERVTE)
వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు, వీళ్ళు సహాయం చెయ్యటం నమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే.
రోమీయులకు 15 : 28 (ERVTE)
ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను.
రోమీయులకు 15 : 29 (ERVTE)
నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు. [PE][PS]
రోమీయులకు 15 : 30 (ERVTE)
సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి.
రోమీయులకు 15 : 31 (ERVTE)
యూదయ ప్రాంతంలోని విశ్వాస హీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి.
రోమీయులకు 15 : 32 (ERVTE)
తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను.
రోమీయులకు 15 : 33 (ERVTE)
శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: