రోమీయులకు 3 : 1 (ERVTE)
సున్నతి పొందిన వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి?
రోమీయులకు 3 : 2 (ERVTE)
ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు.
రోమీయులకు 3 : 3 (ERVTE)
మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగని వాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగని వాడని అనగలమా?
రోమీయులకు 3 : 4 (ERVTE)
అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినాసరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడివుంది: “నీవు మాట్లడినప్పుడు నిజం చెప్పావని ఋజువౌతుంది. [QBR2] నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!” కీర్తన 51:4 [PS]
రోమీయులకు 3 : 5 (ERVTE)
మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను.
రోమీయులకు 3 : 6 (ERVTE)
ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు? [PE][PS]
రోమీయులకు 3 : 7 (ERVTE)
“నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు?
రోమీయులకు 3 : 8 (ERVTE)
మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది. [PS]
రోమీయులకు 3 : 9 (ERVTE)
{నీతిమంతుడొక్కడూ లేడు} [PS] మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకాని వాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే ఋజువు చేసాను.
రోమీయులకు 3 : 10 (ERVTE)
ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: “నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! [QBR2]
రోమీయులకు 3 : 11 (ERVTE)
అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. [QBR] దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. [QBR]
రోమీయులకు 3 : 12 (ERVTE)
అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. [QBR2] అందరూ కలిసి పనికిరాని వాళ్ళైపోయారు. [QBR] మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!” కీర్తన 14:1-3
రోమీయులకు 3 : 13 (ERVTE)
“వాళ్ళనోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. [QBR2] వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి;” కీర్తన 5:9 “వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!” కీర్తన 140:3
రోమీయులకు 3 : 14 (ERVTE)
“వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!” కీర్తన 10:7
రోమీయులకు 3 : 15 (ERVTE)
“వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. [QBR2]
రోమీయులకు 3 : 16 (ERVTE)
వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశ నాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. [QBR]
రోమీయులకు 3 : 17 (ERVTE)
వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” యెషయా 59:7-8]
రోమీయులకు 3 : 18 (ERVTE)
“వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.” కీర్తన 36:1 [PS]
రోమీయులకు 3 : 19 (ERVTE)
ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే యూదులు కాని వాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు.
రోమీయులకు 3 : 20 (ERVTE)
ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. [PS]
రోమీయులకు 3 : 21 (ERVTE)
{విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం} [PS] కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది.
రోమీయులకు 3 : 22 (ERVTE)
దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.
రోమీయులకు 3 : 23 (ERVTE)
అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు [*తేజస్సు అనగా మహిమ.] పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు.
రోమీయులకు 3 : 24 (ERVTE)
కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది.
రోమీయులకు 3 : 25 (ERVTE)
దేవుడు ఇది వరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు.
రోమీయులకు 3 : 26 (ERVTE)
అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం. [PE][PS]
రోమీయులకు 3 : 27 (ERVTE)
మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంభందించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు.
రోమీయులకు 3 : 28 (ERVTE)
మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.
రోమీయులకు 3 : 29 (ERVTE)
దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కాని వాళ్ళకు కూడా దేవుడే.
రోమీయులకు 3 : 30 (ERVTE)
దేవుడు సున్నతి పొందిన వాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు.
రోమీయులకు 3 : 31 (ERVTE)
మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: