రోమీయులకు 8 : 1 (ERVTE)
{ఆత్మ ద్వారా జీవము} [PS] అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు.
రోమీయులకు 8 : 2 (ERVTE)
దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది.
రోమీయులకు 8 : 3 (ERVTE)
ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాప స్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు.
రోమీయులకు 8 : 4 (ERVTE)
ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాప స్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము. [PE][PS]
రోమీయులకు 8 : 5 (ERVTE)
ప్రాపంచికంగా జీవించే వాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించే వాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకులోనై ఉంటుంది.
రోమీయులకు 8 : 6 (ERVTE)
ప్రాపంచిక విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటం వల్ల జీవం. శాంతం లభిస్తాయి.
రోమీయులకు 8 : 7 (ERVTE)
ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు.
రోమీయులకు 8 : 8 (ERVTE)
ప్రాపంచికంగా జీవించే వాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. [PE][PS]
రోమీయులకు 8 : 9 (ERVTE)
దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు.
రోమీయులకు 8 : 10 (ERVTE)
ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు.
రోమీయులకు 8 : 11 (ERVTE)
మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు. [PE][PS]
రోమీయులకు 8 : 12 (ERVTE)
అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు.
రోమీయులకు 8 : 13 (ERVTE)
ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మ ద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు. [PE][PS]
రోమీయులకు 8 : 14 (ERVTE)
దేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు దేవుని కుమారులు.
రోమీయులకు 8 : 15 (ERVTE)
మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము
రోమీయులకు 8 : 16 (ERVTE)
మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు.
రోమీయులకు 8 : 17 (ERVTE)
మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహావారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి. [PS]
రోమీయులకు 8 : 18 (ERVTE)
{రానున్న తేజస్సు} [PS] మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం.
రోమీయులకు 8 : 19 (ERVTE)
దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది.
రోమీయులకు 8 : 20 (ERVTE)
సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది.
రోమీయులకు 8 : 21 (ERVTE)
బానిసత్వంతో క్షిణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్చను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది. [PE][PS]
రోమీయులకు 8 : 22 (ERVTE)
సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు.
రోమీయులకు 8 : 23 (ERVTE)
అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము.
రోమీయులకు 8 : 24 (ERVTE)
మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు?
రోమీయులకు 8 : 25 (ERVTE)
కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము. [PE][PS]
రోమీయులకు 8 : 26 (ERVTE)
అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు.
రోమీయులకు 8 : 27 (ERVTE)
ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్చానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. [PE][PS]
రోమీయులకు 8 : 28 (ERVTE)
దేవుడు తనను ప్రేమించే ప్రజల కేసం, తన ఉద్దేశానుసారం పిలువబడిన వాళ్ళకోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు.
రోమీయులకు 8 : 29 (ERVTE)
దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం.
రోమీయులకు 8 : 30 (ERVTE)
దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు. [PS]
రోమీయులకు 8 : 31 (ERVTE)
{గొప్ప విజయం} [PS] మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు?
రోమీయులకు 8 : 32 (ERVTE)
మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా?
రోమీయులకు 8 : 33 (ERVTE)
దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే.
రోమీయులకు 8 : 34 (ERVTE)
ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు.
రోమీయులకు 8 : 35 (ERVTE)
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా?
రోమీయులకు 8 : 36 (ERVTE)
దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము, [QBR2] మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.” కీర్తన 44:22 [PS]
రోమీయులకు 8 : 37 (ERVTE)
ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము.
రోమీయులకు 8 : 38 (ERVTE)
చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలు గాని, దయ్యాలుగాని, ప్రస్తుతం గాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని
రోమీయులకు 8 : 39 (ERVTE)
ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: