దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 1 (IRVTE)
దావీదు ఇశ్రాయేలు ప్రజలందరికి రాజు
11:1-3; 2సమూ 5:1-3
11:4-9; 2సమూ 5:6-10 ఇదంతా అయ్యాక ఇశ్రాయేలు ప్రజలందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. “ఇలా చూడు, మేము నీకు రక్తమాంసాల్లాంటి వాళ్ళం. నీ సొంత బంధువులం.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 2 (IRVTE)
ఇటీవల సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు సైన్యాలను నడిపిస్తూ ఉన్నావు. నీ దేవుడైన యెహోవా నీతో ‘నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నీవు కాపరిగా ఉంటావు. వారిమీద అధిపతిగా ఉండి పరిపాలన చేస్తావు’ అని చెప్పాడు కదా” అని దావీదుతో అన్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 3 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 4 (IRVTE)
ఇలా ఇశ్రాయేలు ప్రజల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో నిబంధన చేశాడు. వారంతా కలసి ఇశ్రాయేలు ప్రజలందరి పై రాజుగా దావీదుకి అభిషేకం చేశారు. ఈ విధంగా సమూయేలు ప్రకటించిన యెహోవా మాట నెరవేరింది. యెరూషలేమును దావీదు ఆక్రమించడం
11:4-9; 2సమూ 5:6-10 ఆ తరువాత దావీదూ, ఇశ్రాయేలు ప్రజలంతా యెరూషలేము అనే పేరున్న యెబూసుకి వెళ్ళారు. అప్పటికి ఆ దేశంలో స్థానికులైన యెబూసీయులు నివసిస్తున్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 5 (IRVTE)
యెబూసులో నివసించే స్థానికులు దావీదుతో “నువ్వు ఇక్కడికి రాలేవు” అన్నారు. కాని దావీదు అక్కడి సీయోను కోటని ఆక్రమించాడు. ఈ సీయోనునే “దావీదు పట్టణం” అంటారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 6 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 7 (IRVTE)
దానికి ముందు దావీదు “ఎవరు మొదట యెబూసీయులపై దాడి చేస్తాడో అతడే సైన్యాధిపతి అవుతాడు” అని ప్రకటించాడు. దాంతో సెరూయా కొడుకైన యోవాబు అందరి కన్నా ముందుగా వారిపై దాడి చేశాడు. కాబట్టి యోవాబునే సైన్యాధిపతిగా నియమించారు. తరువాత దావీదు ఆ కోటలోనే నివసించాడు. కాబట్టి దానికి “దావీదు పట్టణం” అనే పేరు కలిగింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 8 (IRVTE)
దావీదు ఆ పట్టణాన్ని పునర్నిర్మించాడు. మిల్లో నుండి ప్రాకారం వరకూ పటిష్ట పరిచాడు. పట్టణంలో మిగిలిన ప్రాంతాలను యోవాబు పటిష్టపరిచాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 9 (IRVTE)
దావీదు అంతకంతకూ ఘనత పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 10 (IRVTE)
దావీదు శూరులు
11:10-41; 2సమూ 23:8-39 ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహోవా మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలందరితో కలసి దావీదుని రాజుగా చేసినవాళ్ళూ, దావీదుతో కూడా శూరులుగా, బలవంతులుగా నిలిచిన వాళ్ళూ, నాయకులుగా ఉన్నవాళ్ళూ వీళ్ళే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 11 (IRVTE)
దావీదు దగ్గర శ్రేష్ఠులుగా ఉన్న ఆ శూరుల జాబితాలో ముప్ఫై మంది ఉన్నారు. వారిలో ప్రముఖుడు ఒక హక్మోనీ వాడి కొడుకైన యాషాబాము. ఇతను ఒక యుద్ధంలో కేవలం తన ఈటెతో మూడు వందల మందిని చంపాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 12 (IRVTE)
ఇతని తరువాత పేరు అహోహీయుడైన దోదో కొడుకైన ఎలియాజరుది. ఇతడు ముగ్గురు బలవంతులుగా పేరు పొందిన వారిలో ఒకడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 13 (IRVTE)
ఇతడు పస్దమ్మీములో ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో దావీదుతో కూడా ఉన్నాడు. అక్కడ ఒక బార్లీ చేను ఉంది. మిగిలిన సైన్యం ఫిలిష్తీయులను చూసి పారిపోయారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 14 (IRVTE)
అయితే వీళ్ళు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులను అడ్డుకుని వారిని హతమార్చారు. యెహోవా వారిని రక్షించి వాళ్లకు గొప్ప విజయం అనుగ్రహించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 15 (IRVTE)
ఆ ముప్ఫై మంది శూరుల్లో ప్రముఖులైన ఈ ముగ్గురూ అదుల్లాము అనే రాతి గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీ సైన్యం రెఫాయీము లోయలో మజిలీ చేశారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 16 (IRVTE)
ఆ సమయంలో దావీదు తన స్థావరం అయిన గుహలో ఉండగా ఫిలిష్తీ సైన్యం బేత్లెహేములో మకాం చేశారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 17 (IRVTE)
దావీదు బేత్లెహేము నీటి కోసం ఆశ పడ్డాడు. “బేత్లెహేములోని బావిలో నీళ్ళు నాకెవరు తెస్తారు? ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు నా దాహం తీర్చడానికి నాకెవరు తెస్తారు?” అన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 18 (IRVTE)
కాబట్టి ఆ ముగ్గురు బలవంతులూ ఫిలిష్తీ సైన్యంలోకి చొరబడ్డారు. వారి మధ్యలో నుండి వెళ్ళి ఆ ఊరి ద్వారం దగ్గర బావిలోని నీళ్ళు తోడుకుని వాటిని దావీదుకు తెచ్చి ఇచ్చారు. కానీ దావీదు ఆ నీళ్ళు తాగేందుకు నిరాకరించాడు. వాటిని యెహోవాకు అర్పణగా పారబోసాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 19 (IRVTE)
తరువాత ఇలా అన్నాడు “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక. వీళ్ళు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్ళు వాళ్ళ రక్తం లాంటిది. దాన్నినేను ఎలా తాగగలను?” అన్నాడు. ఈ ముగ్గురు బలవంతులు ఇలాంటి కార్యాలు చేశారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 20 (IRVTE)
యోవాబు సోదరుడైన అబీషై ముగ్గురికీ నాయకుడు. ఒక యుద్ధంలో ఇతడు మూడు వందల మందిని కేవలం తన ఈటెతో హతమార్చాడు. అలా ఆ ముగ్గురితో పాటు తరచుగా ఇతని పేరు కూడా వినిపించేది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 21 (IRVTE)
ముగ్గురిలో ఇతనికి ఎక్కువ గౌరవం, కీర్తీ కలిగాయి. అయితే అతనికి కలిగిన కీర్తి పేరు మోసిన ఆ ముగ్గురు సైనికుల కీర్తికి సాటి కాలేదు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 22 (IRVTE)
ఇంకా కబ్సెయేలు ఊరివాడు యెహోయాదా కొడుకు బెనాయా ఎంతో బలవంతుడు. తన పరాక్రమ కార్యాల వల్ల ఇతడు ఎంతో ప్రసిద్ధికెక్కాడు. ఇతడు మోయాబు వాడు అరీయేలు కొడుకులిద్దర్నీ చంపాడు. ఇంకా ఇతడు మంచు పడే కాలంలో ఒక బిలంలోకి దిగి అక్కడ ఒక సింహాన్ని చంపివేశాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 23 (IRVTE)
ఒకసారి ఇతను ఏడున్నర అడుగుల ఎత్తున్న ఒక ఐగుప్తీయున్నిచంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో సాలెవాడి దండె అంత పెద్ద ఈటె ఉంది. బెనాయా వాడి మీదికి ఒక కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఆ ఈటెను ఐగుప్తీయుడి చేతిలోనుండి లాక్కుని దానితోనే వాణ్ణి చంపివేశాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 24 (IRVTE)
ఇలాంటి ఘన కార్యాలు చేసిన యెహోయాదా కొడుకైన బెనాయా పేరు ఆ ముగ్గురు బలవంతుల పేర్లలో చేర్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 25 (IRVTE)
ముప్ఫై మంది సైనికుల్లో అతణ్ణి గొప్పవాడిగా ఎంచారు, కానీ పేరు మోసిన ఆ ముగ్గురు వీరులకు సాటి కాలేదు. కానీ దావీదు ఇతణ్ణి అంగ రక్షకులపై అధిపతిగా నియమించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 26 (IRVTE)
ఆ యోధులు ఎవరంటే యోవాబు తమ్ముడు అశాహేలు, బేత్లెహేము ఊరివాడు దోదో కొడుకైన ఎల్హానాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 27 (IRVTE)
హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 28 (IRVTE)
తెకోవీయుడైన ఇక్కేషు కొడుకైన ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 29 (IRVTE)
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 30 (IRVTE)
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కొడుకు హేలెదు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 31 (IRVTE)
బెన్యామీను సంతతికి చెందిన గిబియా ఊరివాడు రీబై కొడుకు ఈతయి, పిరాతోనీయుడు బెనాయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 32 (IRVTE)
గాయషు లోయకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 33 (IRVTE)
బహరూమీయుడు అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 34 (IRVTE)
గిజోనీయుడైన హాషేము కొడుకులూ, హరారీయుడైన షాగే కొడుకైన యోనాతాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 35 (IRVTE)
హరారీయుడైన శాకారు కొడుకైన అహీయాము, ఊరు కొడుకు ఎలీపాలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 36 (IRVTE)
మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 37 (IRVTE)
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కొడుకైన నయరై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 38 (IRVTE)
నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 39 (IRVTE)
అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలు మోసేవాడూ బెరోతీయుడూ అయిన నహరై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 40 (IRVTE)
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 41 (IRVTE)
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కొడుకైన జాబాదు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 42 (IRVTE)
రూబేనీయుడైన షీజా కొడుకూ, రూబేనీయులకు నాయకుడూ అయిన అదీనా, అతని తోటి వారైన ముప్ఫై మందీ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 43 (IRVTE)
మయకా కొడుకైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 44 (IRVTE)
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కొడుకులు షామా యెహీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 45 (IRVTE)
షిమ్రీ కొడుకైన యెదీయవేలు, అతని సోదరుడూ, తిజీయుడూ అయిన యోహా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 46 (IRVTE)
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కొడుకులైన యెరీబై యోషవ్యా, మోయాబు వాడు ఇత్మా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 47 (IRVTE)
ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా ఊరివాడు యహశీయేలు అనే వాళ్ళు.
❮
❯