దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 1 (IRVTE)
{యెరూషలేములో దావీదు} (14:1-7; 2సమూ 5:11-16; 1దిన 3:5-8) [PS] తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 2 (IRVTE)
తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 3 (IRVTE)
తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 4 (IRVTE)
యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 5 (IRVTE)
ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 6 (IRVTE)
నోగహు, నెపెగు, యాఫీయ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 7 (IRVTE)
ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు. [PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 8 (IRVTE)
{దావీదు ఫిలిష్తీయులను ఓడించడం} (14:8-17; 2సమూ 5:17-25) [PS] దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 9 (IRVTE)
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 10 (IRVTE)
“ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 11 (IRVTE)
వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 12 (IRVTE)
ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 13 (IRVTE)
ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 14 (IRVTE)
దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 15 (IRVTE)
కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 16 (IRVTE)
దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 17 (IRVTE)
కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు. [PE]
❮
❯