దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 1 (IRVTE)
మందసాన్ని యెరూషలేముకు తిరిగి తీసుకురావడం
15:25-16:3; 2సమూ 6:12-19
దావీదు తన కోసం దావీదు పట్టణంలో ఇళ్ళు కట్టించుకున్నాడు. దేవుని మందసం కోసం ఒక స్థలాన్ని సిద్ధపరచి, అక్కడ ఒక గుడారం వేయించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 2 (IRVTE)
అప్పుడు దావీదు “మందసాన్ని మోయడానికీ నిత్యం ఆయనకు సేవ చెయ్యడానికీ యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నాడు, వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరూ దేవుని మందసాన్ని మోయకూడదు” అని ఆజ్ఞాపించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 3 (IRVTE)
అప్పుడు దావీదు తాను యెహోవా మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావడానికి ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 4 (IRVTE)
అహరోను సంతతి వారిని, లేవీయులను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 5 (IRVTE)
కహాతు సంతతిలో నుండి వారి నాయకుడైన ఊరీయేలును, అతని బంధువుల్లో నూట ఇరవైమందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 6 (IRVTE)
మెరారీయుల్లో వారి నాయకుడైన అశాయాను, అతని బంధువుల్లో రెండువందల ఇరవై మందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 7 (IRVTE)
గెర్షోను సంతతిలో వారి నాయకుడైన యోవేలును, అతని బంధువుల్లో నూట ముప్ఫై మందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 8 (IRVTE)
ఎలీషాపాను సంతతిలో వారి నాయకుడైన షెమయాను, అతని బంధువుల్లో రెండువందల మందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 9 (IRVTE)
హెబ్రోను సంతతి వారికి అధిపతి అయిన ఎలీయేలును, అతని బంధువుల్లో ఎనభై మందిని,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 10 (IRVTE)
ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 11 (IRVTE)
అప్పుడు దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనే వాళ్ళతో
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 12 (IRVTE)
“లేవీయుల పూర్వీకుల వంశాలకు మీరు పెద్దలుగా ఉన్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 13 (IRVTE)
ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని మోయకపోవడం చేత, ఆయన దగ్గర విచారణ చేయక పోవడం చేత, ఆయన మనలో నాశనం కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు, మీవాళ్ళు, మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకుని, నేను ఆ మందసానికి సిద్ధం చేసిన స్థలానికి దాన్ని తీసుకురావాలి” అన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 14 (IRVTE)
అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మందసాన్ని తీసుకురావడానికి తమను తాము ప్రతిష్ట చేసుకున్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 15 (IRVTE)
తరువాత లేవీయులు యెహోవా చెప్పిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్టు దేవుని మందసాన్ని దాని మోత కర్రలతో తమ భుజాల మీదికి ఎత్తుకున్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 16 (IRVTE)
అప్పుడు దావీదు “మీరు మీ బంధువులైన వాద్యకారులను పిలిచి, స్వరమండలాలు, తీగ వాద్యాలు, కంచు తాళాలతో ఉన్న వాద్యాలతో, గంభీర శబ్ధంతో, సంతోషంతో గొంతెత్తి పాడేలా ఏర్పాటు చెయ్యండి” అని లేవీయుల నాయకులకు ఆజ్ఞాపించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 17 (IRVTE)
కాబట్టి లేవీయులు, యోవేలు కొడుకు హేమాను, అతని బంధువుల్లో బెరెక్యా కొడుకు ఆసాపు, తమ బంధువులైన మెరారీయుల్లో కూషాయాహు కొడుకు ఏతాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 18 (IRVTE)
వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 19 (IRVTE)
వాద్యకారులైన హేమాను, ఆసాపు, ఏతాను పంచలోహాల తాళాలు వాయించడానికి నిర్ణయం అయింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 20 (IRVTE)
జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా అనే వాళ్ళు హెచ్చు స్వరం కలిగిన స్వరమండలాలు వాయించాలని నిర్ణయం అయింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 21 (IRVTE)
ఇంకా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు, అజజ్యాహు అనే వాళ్ళు రాగం ఎత్తడానికీ, తీగ వాయిద్యాలు వాయించడానికీ నిర్ణయం అయింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 22 (IRVTE)
లేవీయులకు అధిపతి అయిన కెనన్యా సంగీతం నిర్వహణలో ప్రవీణుడు గనుక అతడు దాన్ని జరిగించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 23 (IRVTE)
బెరెక్యా, ఎల్కానా మందసానికి ముందు నడిచే సంరక్షకులుగా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 24 (IRVTE)
షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 25 (IRVTE)
దావీదు, ఇశ్రాయేలీయుల పెద్దలు, సహస్రాధిపతులు యెహోవా నిబంధన మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనుంచి తీసుకు రావడానికి ఉత్సాహంతో వెళ్ళారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 26 (IRVTE)
యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 27 (IRVTE)
దావీదు, మందసం మోసే లేవీయులందరూ, సంగీతం నిర్వహించే కెనన్యా సన్నని నారతో నేసిన వస్త్రాలు వేసుకున్నారు. దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 28 (IRVTE)
ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటం చేస్తూ కొమ్ములు, బాకాలు ఊదుతూ, కంచు తాళాలు కొడుతూ, స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయిస్తూ యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు వచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 15 : 29 (IRVTE)
కాని, యెహోవా నిబంధన మందసం దావీదు పట్టణంలోకి వచ్చినప్పుడు, సౌలు కూతురు మీకాలు కిటికీలో నుంచి చూసి రాజైన దావీదు నాట్యం చేస్తూ సంబరం చేసుకోవడం గమనించి, తన మనస్సులో అతన్ని అసహ్యించుకుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29