దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 1 (IRVTE)
ఇశ్రాయేలు
2:1-2; ఆది 35:23-26
ఇశ్రాయేలు కొడుకులు వీళ్ళు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 2 (IRVTE)
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 3 (IRVTE)
యూదా
2:5-15; రూతు 4:18-22; మత్తయి 1:3-6
యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా అనేవాళ్ళు. ఈ ముగ్గురి తల్లి ఒక కనానీయురాలు. ఆమె షూయ అనేవాడి కూతురు. యూదా పెద్దకొడుకు పేరు ఏరు. ఇతడు యెహోవా దృష్టిలో పాపం చేశాడు. అందుకని యెహోవా అతణ్ణి చంపాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 4 (IRVTE)
తరువాత అతని కోడలైన తామారు ద్వారా అతనికి పెరెసు, జెరహు అనే కొడుకులు పుట్టారు. యూదాకు మొత్తం ఐదుగురు కొడుకులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 5 (IRVTE)
పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు అనేవాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 6 (IRVTE)
జెరహుకు ఐదుగురు కొడుకులు కలిగారు. వీరు జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దారా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 7 (IRVTE)
కర్మీ కొడుకుల్లో ఒకడి పేరు ఆకాను. ఇతడు శాపానికి గురైన వస్తువుల్లో కొన్నిటిని దొంగతనం చేశాడు. అలా చేసి ఇశ్రాయేలీయులను ఎంతో యాతన పెట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 8 (IRVTE)
ఏతాను కొడుకు పేరు అజర్యా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 9 (IRVTE)
హెస్రోనుకు పుట్టిన కొడుకులు యెరహ్మెయేలు, రము, కెలూబై.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 10 (IRVTE)
రముకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబుకు నయస్సోను పుట్టాడు. ఈ నయస్సోను యూదా ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 11 (IRVTE)
నయస్సోనుకు శల్మాను పుట్టాడు, శల్మానుకు బోయజు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 12 (IRVTE)
బోయజుకు ఓబేదు పుట్టాడు. ఓబేదుకు యెష్షయి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 13 (IRVTE)
యెష్షయి పెద్ద కొడుకు పేరు ఏలీయాబు. రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు షమ్మా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 14 (IRVTE)
నాల్గోవాడు నెతనేలు, ఐదోవాడు రద్దయి,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 15 (IRVTE)
ఆరోవాడు ఓజెము, ఏడోవాడు దావీదు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 16 (IRVTE)
వీళ్ళకు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు సెరూయా అబీగయీలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 17 (IRVTE)
అబీగయీలుకు అమాశా పుట్టాడు. ఈ అమాశా తండ్రి యెతెరు అనే ఇష్మాయేలీయుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 18 (IRVTE)
హెస్రోను కొడుకు కాలేబుకు అజూబా అనే తన భార్య వల్లా, యెరీయోతు* యెరీయోతు అజూబా భార్య అనే ఆమె వల్లా పిల్లలు కలిగారు. అజూబా కొడుకులు యేషెరు, షోబాబు, అర్దోను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 19 (IRVTE)
అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతా అనే ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె వల్ల అతనికి హూరు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 20 (IRVTE)
హూరుకు ఊరీ పుట్టాడు. ఊరీకి బెసలేలు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 21 (IRVTE)
తరువాత హెస్రోను అరవై ఏళ్ల వయస్సప్పుడు మాకీరు కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు. ఈ మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోనుకు సెగూబు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 22 (IRVTE)
సెగూబుకు యాయీరు పుట్టాడు. ఇతని ఆధీనంలో గిలాదు దేశంలో ఇరవై మూడు పట్టణాలు ఉండేవి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 23 (IRVTE)
వీళ్ళ దగ్గరనుండి యాయీరు పట్టణాలనూ, కెనాతునూ, వీటి చుట్టూ ఉన్న మరో అరవై ఊళ్లనూ గెషూరు వాళ్లూ అరామీయులూ తీసుకున్నారు. వీళ్ళంతా గిలాదుకు తండ్రి అయిన మాకీరు సంతానం.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 24 (IRVTE)
హెస్రోను చనిపోయిన తరువాత కాలేబు-ఎఫ్రతా పట్టణంలో హెస్రోను భార్య అష్షూరును కన్నది. ఈ అష్షూరు తెకోవ అనే వాడికి తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 25 (IRVTE)
హెస్రోను పెద్దకొడుకు యెరహ్మెయేలు. ఈ యెరహ్మెయేలు పెద్ద కొడుకు రము. మిగిలిన కొడుకులు ఎవరంటే బూనా, ఓరెను, ఓజెము, అహీయా అనేవాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 26 (IRVTE)
ఈ యెరహ్మెయేలుకు మరో భార్య ఉంది. ఆమె పేరు అటారా. ఈమె ఓనాము తల్లి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 27 (IRVTE)
యెరహ్మెయేలు పెద్దకొడుకు రముకు మయజూ, యామీను, ఏకెరు అనే కొడుకులున్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 28 (IRVTE)
ఓనాము కొడుకులు షమ్మయి, యాదాలు. షమ్మయి కొడుకులు నాదాబు, అబీషూరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 29 (IRVTE)
అబీషూరు భార్య పేరు అబీహయిలు. ఈమె ద్వారా అబీషూరుకు అహ్బాను, మొలీదు అనే పేరున్న కొడుకులు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 30 (IRVTE)
నాదాబు కొడుకులు సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు పుట్టకుండానే చనిపోయాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 31 (IRVTE)
అప్పయీం కొడుకుల్లో ఇషీ అనే వాడున్నాడు. ఇషీ కొడుకుల్లో షేషాను అనే వాడున్నాడు. షేషాను కొడుకుల్లో అహ్లయి అనే వాడున్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 32 (IRVTE)
షమ్మయికి సోదరుడైన యాదా కొడుకులు యెతెరు, యోనాతాను. వీరిలో యెతెరు ఎలాంటి సంతానం లేకుండానే చనిపోయాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 33 (IRVTE)
యోనాతాను కొడుకులు పేలెతు, జాజా. వీళ్ళంతా యెరహ్మెయేలు వారసులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 34 (IRVTE)
షేషానుకు కూతుళ్ళు పుట్టారు గానీ కొడుకులు కలగలేదు. ఈ షేషానుకు యరహా అనే ఒక దాసుడున్నాడు. వాడు ఐగుప్తీయుడు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 35 (IRVTE)
షేషాను తన కూతుర్ని ఈ యరహాకు ఇచ్చాడు. యరహాకు ఆమె ద్వారా అత్తయి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 36 (IRVTE)
అత్తయికి నాతాను పుట్టాడు. నాతానుకి జాబాదు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 37 (IRVTE)
జాబాదుకి ఎప్లాలు పుట్టాడు. ఎప్లాలుకి ఓబేదు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 38 (IRVTE)
ఓబేదుకి యెహూ పుట్టాడు. యెహూకి అజర్యా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 39 (IRVTE)
అజర్యాకి హేలెస్సు పుట్టాడు. హేలెస్సుకి ఎలాశా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 40 (IRVTE)
ఎలాశాకి సిస్మాయీ పుట్టాడు. సిస్మాయీకి షల్లూము పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 41 (IRVTE)
షల్లూముకి యెకమ్యా పుట్టాడు. యెకమ్యాకి ఎలీషామా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 42 (IRVTE)
యెరహ్మెయేలు తోడబుట్టిన వాడు కాలేబు కొడుకులెవరంటే మేషా, మారేషా. వీరిలో మేషా పెద్దవాడు. ఇతని కొడుకు జీఫు. మారేషా కొడుకు పేరు హెబ్రోను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 43 (IRVTE)
హెబ్రోను కొడుకులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 44 (IRVTE)
షెమకు రహము పుట్టాడు. ఈ రహము యోర్కెయాముకు తండ్రి. రేకెముకు షమ్మయి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 45 (IRVTE)
షమ్మయి కొడుకు మాయోను. ఈ మాయోను బేత్సూరుకు తండ్రి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 46 (IRVTE)
కాలేబు ఉంపుడుకత్తె అయిన ఏయిఫా హారాను, మోజాను, గాజేజులకు జన్మనిచ్చింది. హారానుకు గాజేజు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 47 (IRVTE)
యెహ్దయి కొడుకులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 48 (IRVTE)
కాలేబు ఉంపుడుకత్తె అయిన మయకా షెబెరుకీ, తిర్హనాకీ జన్మనిచ్చింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 49 (IRVTE)
ఆమెకి ఇంకా షయపు, షెవాను పుట్టారు. వీరిలో షయపుకు మద్మన్నా, షెవానుకు గిబీ వాడు మక్బేనా పుట్టారు. కాలేబు కూతురి పేరు అక్సా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 50 (IRVTE)
ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 51 (IRVTE)
వీళ్ళలో శోబాలుకు కిర్యత్యారీము, శల్మాకు బేత్లెహేము, హారేపుకు బేత్గాదేరు పుట్టారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 52 (IRVTE)
కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు వారసులు హారోయే, ఇంకా మనుహోతీయుల్లో సగం మంది ఇతని వంశం వాళ్ళే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 53 (IRVTE)
కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 54 (IRVTE)
శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2 : 55 (IRVTE)
యబ్బేజులో నివసించే లేఖికుల కుటుంబాలైన తిరాతీయులూ, షిమ్యాతీయులూ, శూకోతీయులూ. వీళ్ళు రేకాబు కుటుంబాలకు పూర్వీకుడైన హమాతుకు వారసులుగా కలిగిన కేనీయులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55