దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 1 (IRVTE)
{యాజకుల విభజన} [PS] అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 2 (IRVTE)
నాదాబు, అబీహు, సంతానం లేకుండానే తమ తండ్రి కంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుతూ వచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 3 (IRVTE)
దావీదు ఎలియాజరు సంతానంలో సాదోకును, ఈతామారు సంతానంలో అహీమెలెకును ఏర్పాటు చేసి, వారి జనం లెక్కను బట్టి పని నియమించాడు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 4 (IRVTE)
వాళ్ళను ఏర్పాటు చెయ్యడంలో ఈతామారు సంతానంలోని పెద్దలకంటే ఎలియాజరు సంతానంలోని పెద్దలు ఎక్కువగా కనిపించారు గనుక ఎలియాజరు సంతానంలో పదహారుగురు తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ, ఈతామారు సంతానంలో ఎనిమిదిమంది తమ తమ పూర్వీకుల ఇంటివాళ్లను పెద్దలుగానూ నియమించడం జరిగింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 5 (IRVTE)
ఎలియాజరు సంతానంలో ఉన్నవాళ్ళు, ఈతామారు సంతానంలో కొందరూ దేవునికి ప్రతిష్ఠితులైన అధికారులుగా ఉన్నారు గనుక పరిశుద్ధ స్థలానికి అధికారులుగా ఉండడానికి చీట్లు వేసి వంతులు పంచుకున్నారు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 6 (IRVTE)
లేవీయుల్లో శాస్త్రిగా ఉన్న నెతనేలు కొడుకు షెమయా, ఈ జాబితా రాశాడు. రాజు, అధికారులు, యాజకుడు సాదోకు, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజకులు, లేవీయులు, పూర్వీకుల ఇంటిపెద్దలు, వీళ్ళందరి సమక్షంలో వాళ్ళ పేర్లు రాశాడు. ఒక్కొక్క పాత్రలోనుంచి ఒక పూర్వీకుని వంశం చీటీ తీసినప్పుడు, ఒకటి ఎలియాజరు పేరట, తరువాత ఇంకొకటి ఈతామారు పేరట తీశారు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 7 (IRVTE)
మొదటి చీటి యెహోయారీబుకు, రెండోది యెదాయాకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 8 (IRVTE)
మూడోది హారీముకు, నాలుగోది శెయొరీముకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 9 (IRVTE)
అయిదోది మల్కీయాకు, ఆరోది మీయామినుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 10 (IRVTE)
ఏడోది హక్కోజుకు, ఎనిమిదోది అబీయాకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 11 (IRVTE)
తొమ్మిదోది యేషూవకు, పదోది షెకన్యాకు, పదకొండోది ఎల్యాషీబుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 12 (IRVTE)
పండ్రెండోది యాకీముకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 13 (IRVTE)
పదమూడోది హుప్పాకు, పదనాలుగోది యెషెబాబుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 14 (IRVTE)
పదిహేనోది బిల్గాకు, పదహారోది ఇమ్మేరుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 15 (IRVTE)
పదిహేడోది హెజీరుకు, పద్దెనిమిదోది హప్పిస్సేసుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 16 (IRVTE)
పంతొమ్మిదోది పెతహయాకు, ఇరవైయవది యెహెజ్కేలుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 17 (IRVTE)
ఇరవై ఒకటోది యాకీనుకు, ఇరవై రెండోది గామూలుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 18 (IRVTE)
ఇరవై మూడోది దెలాయ్యాకు, ఇరవైనాలుగోది మయజ్యాకు పడ్డాయి. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 19 (IRVTE)
ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా వాళ్ళ పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు తమ పద్ధతి ప్రకారం యెహోవా మందిరంలో ప్రవేశించి చెయ్యవలసిన సేవాధర్మం ఈ విధంగా ఏర్పాటు అయింది. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 20 (IRVTE)
మిగిలిన లేవీ సంతానం ఎవరంటే, అమ్రాము సంతానంలో షూబాయేలు, షూబాయేలు సంతానంలో యెహెద్యాహు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 21 (IRVTE)
రెహబ్యా ఇంట్లో అంటే రెహబ్యా సంతానంలో పెద్దవాడు ఇష్షీయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 22 (IRVTE)
ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 23 (IRVTE)
హెబ్రోను సంతానంలో పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమర్యా, మూడోవాడు యహజీయేలు, నాలుగోవాడు యెక్మెయాములు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 24 (IRVTE)
ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 25 (IRVTE)
ఇష్షీయా సంతానంలో జెకర్యా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 26 (IRVTE)
మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 27 (IRVTE)
యహజీయాహు వలన మెరారికి కలిగిన కొడుకులు ఎవరంటే, బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 28 (IRVTE)
మహలికి ఎలియాజరు పుట్టాడు, ఇతనికి కొడుకులు లేరు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 29 (IRVTE)
కీషు సంతతి వారిలో యెరహ్మెయేలు ఉన్నాడు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 30 (IRVTE)
మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీళ్ళు తమ కుటుంబ లెక్కల్లో ఉన్న లేవీయులు. [PE][PS]
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 31 (IRVTE)
రాజైన దావీదు ఎదుటా, యాజకులైన సాదోకు, అహీమెలెకుల ఎదుటా వీరంతా చీట్లు వేశారు. వంశంలో పెద్ద కొడుకుల కుటుంబాల వారు, చిన్న కొడుకుల కుటుంబాల వారితో కలిసి చీట్లు వేసుకున్నారు. వీరంతా తమ సహోదరులైన అహరోను సంతానం చేసినట్టే చీట్లు వేసుకున్నారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: