దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 1 (IRVTE)
లేవి వంశం
6:54-80; యెహో 21:4-39 లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 2 (IRVTE)
కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 3 (IRVTE)
అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 4 (IRVTE)
ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 5 (IRVTE)
అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 6 (IRVTE)
ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 7 (IRVTE)
మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 8 (IRVTE)
అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 9 (IRVTE)
అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 10 (IRVTE)
యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 11 (IRVTE)
అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 12 (IRVTE)
అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 13 (IRVTE)
షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 14 (IRVTE)
అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 15 (IRVTE)
యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 16 (IRVTE)
లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 17 (IRVTE)
గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 18 (IRVTE)
కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 19 (IRVTE)
మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 20 (IRVTE)
గెర్షోను కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్మా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 21 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 22 (IRVTE)
జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఇద్దో, ఇద్దో కొడుకు జెరహు, జెరహు కొడుకు యెయతిరయి. కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు, కోరహు కొడుకు అస్సీరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 23 (IRVTE)
అస్సీరు కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 24 (IRVTE)
అస్సీరు కొడుకు తాహెతు, తాహెతు కొడుకు ఊరియేలు, ఊరియేలు కొడుకు ఉజ్జియా, ఉజ్జియా కొడుకు షావూలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 25 (IRVTE)
ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 26 (IRVTE)
ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 27 (IRVTE)
నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 28 (IRVTE)
సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు* యోవేలు వషీని , మరొకడు అబీయాయు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 29 (IRVTE)
మెరారి కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 30 (IRVTE)
ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా. హగ్గీయా కొడుకు అశాయా.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 31 (IRVTE)
నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 32 (IRVTE)
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 33 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 34 (IRVTE)
ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 35 (IRVTE)
సమూయేలు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యెరోహాముకి పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు. ఎలీయేలు తోయహుకి పుట్టాడు. తోయహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాశైకి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 36 (IRVTE)
అమాశై ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యోవేలుకి పుట్టాడు. యోవేలు అజర్యాకి పుట్టాడు. అజర్యా జెఫన్యాకి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 37 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 38 (IRVTE)
జెఫన్యా తాహతుకి పుట్టాడు. తాహతు అస్సీరుకి పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 39 (IRVTE)
కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 40 (IRVTE)
హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా షిమ్యా కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 41 (IRVTE)
షిమ్యా మిఖాయేలు కొడుకు. మిఖాయేలు బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 42 (IRVTE)
మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 43 (IRVTE)
అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 44 (IRVTE)
షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవి కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 45 (IRVTE)
హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు. మల్లూకు హషబ్యా కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 46 (IRVTE)
హషబ్యా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 47 (IRVTE)
హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షమెరు కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 48 (IRVTE)
షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 49 (IRVTE)
వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు. అహరోనూ వంశం
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 50 (IRVTE)
అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 51 (IRVTE)
అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 52 (IRVTE)
అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్య.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 53 (IRVTE)
జెరహ్య కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 54 (IRVTE)
అహీటూబు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు అహిమయస్సు. అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 55 (IRVTE)
దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 56 (IRVTE)
అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 57 (IRVTE)
అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 58 (IRVTE)
హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 59 (IRVTE)
అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 60 (IRVTE)
ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 61 (IRVTE)
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 62 (IRVTE)
కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 63 (IRVTE)
గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది. మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 64 (IRVTE)
ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 65 (IRVTE)
వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 66 (IRVTE)
కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 67 (IRVTE)
ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 68 (IRVTE)
యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 69 (IRVTE)
అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 70 (IRVTE)
అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 71 (IRVTE)
అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 72 (IRVTE)
ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 73 (IRVTE)
రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 74 (IRVTE)
ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 75 (IRVTE)
హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 76 (IRVTE)
నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 77 (IRVTE)
ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 78 (IRVTE)
ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 79 (IRVTE)
కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 80 (IRVTE)
అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6 : 81 (IRVTE)
హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
❮
❯