1 కొరింథీయులకు 10 : 1 (IRVTE)
{అరణ్యప్రయాణంలో ఇశ్రాయేలీయులు మనకి హెచ్చరికగా ఉన్నారు} [PS] సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.
1 కొరింథీయులకు 10 : 2 (IRVTE)
అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.
1 కొరింథీయులకు 10 : 3 (IRVTE)
వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు.
1 కొరింథీయులకు 10 : 4 (IRVTE)
ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.
1 కొరింథీయులకు 10 : 5 (IRVTE)
అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు. [PE][PS]
1 కొరింథీయులకు 10 : 6 (IRVTE)
వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.
1 కొరింథీయులకు 10 : 7 (IRVTE)
“ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.
1 కొరింథీయులకు 10 : 8 (IRVTE)
వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.
1 కొరింథీయులకు 10 : 9 (IRVTE)
వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.
1 కొరింథీయులకు 10 : 10 (IRVTE)
అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు. [PE][PS]
1 కొరింథీయులకు 10 : 11 (IRVTE)
నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.
1 కొరింథీయులకు 10 : 12 (IRVTE)
కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.
1 కొరింథీయులకు 10 : 13 (IRVTE)
ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు. [PE][PS]
1 కొరింథీయులకు 10 : 14 (IRVTE)
కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.
1 కొరింథీయులకు 10 : 15 (IRVTE)
తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. [PS]
1 కొరింథీయులకు 10 : 16 (IRVTE)
{ప్రభువు బల్ల సహవాసం కోసం ప్రత్యేకత అవసరం} [PS] మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.
1 కొరింథీయులకు 10 : 17 (IRVTE)
మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం. [PE][PS]
1 కొరింథీయులకు 10 : 18 (IRVTE)
ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?
1 కొరింథీయులకు 10 : 19 (IRVTE)
ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.
1 కొరింథీయులకు 10 : 20 (IRVTE)
యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.
1 కొరింథీయులకు 10 : 21 (IRVTE)
మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
1 కొరింథీయులకు 10 : 22 (IRVTE)
ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా? [PS]
1 కొరింథీయులకు 10 : 23 (IRVTE)
{ఆహారపానీయాల విషయంలో ప్రేమ నియమం} (రోమా 14:1-23) [PS] అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.
1 కొరింథీయులకు 10 : 24 (IRVTE)
ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.
1 కొరింథీయులకు 10 : 25 (IRVTE)
మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.
1 కొరింథీయులకు 10 : 26 (IRVTE)
ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే. [PE][PS]
1 కొరింథీయులకు 10 : 27 (IRVTE)
ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.
1 కొరింథీయులకు 10 : 28 (IRVTE)
అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.
1 కొరింథీయులకు 10 : 29 (IRVTE)
ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి?
1 కొరింథీయులకు 10 : 30 (IRVTE)
నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి? [PE][PS]
1 కొరింథీయులకు 10 : 31 (IRVTE)
కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.
1 కొరింథీయులకు 10 : 32 (IRVTE)
యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.
1 కొరింథీయులకు 10 : 33 (IRVTE)
నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: