1 కొరింథీయులకు 16 : 1 (IRVTE)
అంతిమ హెచ్చరికలు, అభినందనలు పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
1 కొరింథీయులకు 16 : 2 (IRVTE)
నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
1 కొరింథీయులకు 16 : 3 (IRVTE)
నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
1 కొరింథీయులకు 16 : 4 (IRVTE)
నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
1 కొరింథీయులకు 16 : 5 (IRVTE)
నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
1 కొరింథీయులకు 16 : 6 (IRVTE)
అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
1 కొరింథీయులకు 16 : 7 (IRVTE)
ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
1 కొరింథీయులకు 16 : 8 (IRVTE)
కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
1 కొరింథీయులకు 16 : 9 (IRVTE)
ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
1 కొరింథీయులకు 16 : 10 (IRVTE)
తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
1 కొరింథీయులకు 16 : 11 (IRVTE)
కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
1 కొరింథీయులకు 16 : 12 (IRVTE)
1 కొరింథీయులకు 16 : 13 (IRVTE)
సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు. మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
1 కొరింథీయులకు 16 : 14 (IRVTE)
మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
1 కొరింథీయులకు 16 : 15 (IRVTE)
స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
1 కొరింథీయులకు 16 : 16 (IRVTE)
కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
1 కొరింథీయులకు 16 : 17 (IRVTE)
స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
1 కొరింథీయులకు 16 : 18 (IRVTE)
నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
1 కొరింథీయులకు 16 : 19 (IRVTE)
ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
1 కొరింథీయులకు 16 : 20 (IRVTE)
ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
1 కొరింథీయులకు 16 : 21 (IRVTE)
పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
1 కొరింథీయులకు 16 : 22 (IRVTE)
ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
1 కొరింథీయులకు 16 : 23 (IRVTE)
ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
1 కొరింథీయులకు 16 : 24 (IRVTE)
క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24