సమూయేలు మొదటి గ్రంథము 31 : 1 (IRVTE)
సౌలు మరణం
31:1-13; 2సమూ 1:4-12; 1దిన 10:1-12 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ,
సమూయేలు మొదటి గ్రంథము 31 : 2 (IRVTE)
సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 3 (IRVTE)
యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి,
సమూయేలు మొదటి గ్రంథము 31 : 4 (IRVTE)
“సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 5 (IRVTE)
సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 6 (IRVTE)
సమూయేలు మొదటి గ్రంథము 31 : 7 (IRVTE)
ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 8 (IRVTE)
లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు. తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,
సమూయేలు మొదటి గ్రంథము 31 : 9 (IRVTE)
అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 10 (IRVTE)
సమూయేలు మొదటి గ్రంథము 31 : 11 (IRVTE)
వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు. ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని
సమూయేలు మొదటి గ్రంథము 31 : 12 (IRVTE)
బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు.
సమూయేలు మొదటి గ్రంథము 31 : 13 (IRVTE)
ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13