1 థెస్సలొనీకయులకు 5 : 1 (IRVTE)
ఆదర్శ వంతమైన నడవడి. యెహోవా దినం సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు.
1 థెస్సలొనీకయులకు 5 : 2 (IRVTE)
రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు.
1 థెస్సలొనీకయులకు 5 : 3 (IRVTE)
ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
1 థెస్సలొనీకయులకు 5 : 4 (IRVTE)
సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు.
1 థెస్సలొనీకయులకు 5 : 5 (IRVTE)
మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు.
1 థెస్సలొనీకయులకు 5 : 6 (IRVTE)
కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.
1 థెస్సలొనీకయులకు 5 : 7 (IRVTE)
నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు.
1 థెస్సలొనీకయులకు 5 : 8 (IRVTE)
విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనలను మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమను కవచంగా, రక్షణ కొరకైన ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకుందాం.
1 థెస్సలొనీకయులకు 5 : 9 (IRVTE)
ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనలను నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు.
1 థెస్సలొనీకయులకు 5 : 10 (IRVTE)
మనం మెలకువగా ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు.
1 థెస్సలొనీకయులకు 5 : 11 (IRVTE)
కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి.
1 థెస్సలొనీకయులకు 5 : 12 (IRVTE)
సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి.
1 థెస్సలొనీకయులకు 5 : 13 (IRVTE)
వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి.
1 థెస్సలొనీకయులకు 5 : 14 (IRVTE)
సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి.
1 థెస్సలొనీకయులకు 5 : 15 (IRVTE)
ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి.
1 థెస్సలొనీకయులకు 5 : 16 (IRVTE)
1 థెస్సలొనీకయులకు 5 : 17 (IRVTE)
ఎప్పుడూ సంతోషంగా ఉండండి.
1 థెస్సలొనీకయులకు 5 : 18 (IRVTE)
ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి.
1 థెస్సలొనీకయులకు 5 : 19 (IRVTE)
ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం.
1 థెస్సలొనీకయులకు 5 : 20 (IRVTE)
దేవుని ఆత్మను ఆర్పవద్దు.
1 థెస్సలొనీకయులకు 5 : 21 (IRVTE)
ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
1 థెస్సలొనీకయులకు 5 : 22 (IRVTE)
అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి.
1 థెస్సలొనీకయులకు 5 : 23 (IRVTE)
ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి.
1 థెస్సలొనీకయులకు 5 : 24 (IRVTE)
శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక! మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు.
1 థెస్సలొనీకయులకు 5 : 25 (IRVTE)
సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి.
1 థెస్సలొనీకయులకు 5 : 26 (IRVTE)
పవిత్రమైన ముద్దుపెట్టుకుని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి.
1 థెస్సలొనీకయులకు 5 : 27 (IRVTE)
సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను.
1 థెస్సలొనీకయులకు 5 : 28 (IRVTE)
మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28