1 తిమోతికి 2 : 1 (IRVTE)
ప్రార్థన, స్త్రీపురుషులకై దైవక్రమం మనం సంపూర్ణ భక్తి, గౌరవాలతో, ప్రశాంతంగా, సుఖంగా బతకడానికై, మనుషులందరి కోసం,
1 తిమోతికి 2 : 2 (IRVTE)
రాజుల కోసం, అధికారంలో ఉన్న వారందరి కోసం, విన్నపాలూ ప్రార్థనలు, ఇతరుల కోసం విన్నపాలు చేస్తూ కృతజ్ఞతలు చెల్లించాలని అన్నిటికంటే ముఖ్యంగా కోరుతున్నాను.
1 తిమోతికి 2 : 3 (IRVTE)
ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది.
1 తిమోతికి 2 : 4 (IRVTE)
మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.
1 తిమోతికి 2 : 5 (IRVTE)
దేవుడొక్కడే, దేవునికీ మనిషికీ మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనే మానవుడు.
1 తిమోతికి 2 : 6 (IRVTE)
ఈయన అందరి కోసం విమోచన వెలగా తనను తానే సమర్పించుకున్నాడు. సరైన సమయంలో దేవుడు దీన్ని ధృవీకరించాడు.
1 తిమోతికి 2 : 7 (IRVTE)
1 తిమోతికి 2 : 8 (IRVTE)
దీన్ని గూర్చి ప్రకటించేవానిగా అపొస్తలునిగా దేవుడు నన్ను నియమించాడు. నిజం చెబుతున్నాను. అబద్ధమాడడం లేదు. నేను యూదులు కాని వారికి విశ్వాస సత్యాలను బోధించేవాణ్ణి.
1 తిమోతికి 2 : 9 (IRVTE)
అందుచేత అన్ని స్థలాల్లోనూ పురుషులు ఆగ్రహం, తర్కవితర్కాలు లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి గానీ జడలతో బంగారంతో ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో కాకుండా
1 తిమోతికి 2 : 10 (IRVTE)
భక్తిపరులమని చెప్పుకొనే స్త్రీలకు తగినట్టుగా మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
1 తిమోతికి 2 : 11 (IRVTE)
స్త్రీలు మౌనంగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
1 తిమోతికి 2 : 12 (IRVTE)
ఉపదేశించడానికీ, పురుషుని మీద అధికారం చేయడానికీ స్త్రీకి అనుమతినివ్వను. స్త్రీ మౌనంగా ఉండవలసిందే.
1 తిమోతికి 2 : 13 (IRVTE)
ఎందుకంటే దేవుడు మొదట ఆదామును తరువాత హవ్వను గదా సృష్టించాడు?
1 తిమోతికి 2 : 14 (IRVTE)
ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది.
1 తిమోతికి 2 : 15 (IRVTE)
అయినా స్త్రీలు వివేకవతులై, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉంటే ప్రసవం ద్వారా దేవుడు వారిని కాపాడతాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15