సమూయేలు రెండవ గ్రంథము 22 : 1 (IRVTE)
సమూయేలు రెండవ గ్రంథము 22 : 2 (IRVTE)
యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు. యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 3 (IRVTE)
నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 4 (IRVTE)
స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 5 (IRVTE)
మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 6 (IRVTE)
పాతాళ* పాతాళ చనిపోయిన వారి ప్రదేశం పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 7 (IRVTE)
నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 8 (IRVTE)
అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 9 (IRVTE)
ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 10 (IRVTE)
ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 11 (IRVTE)
ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 12 (IRVTE)
అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 13 (IRVTE)
ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 14 (IRVTE)
యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 15 (IRVTE)
తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 16 (IRVTE)
యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 17 (IRVTE)
పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 18 (IRVTE)
బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 19 (IRVTE)
విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 20 (IRVTE)
యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 21 (IRVTE)
నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 22 (IRVTE)
ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 23 (IRVTE)
ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 24 (IRVTE)
ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 25 (IRVTE)
నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 26 (IRVTE)
నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 27 (IRVTE)
నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 28 (IRVTE)
యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 29 (IRVTE)
యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 30 (IRVTE)
నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను† అధిగమిస్తాను అణిచివేస్తాను . నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 31 (IRVTE)
దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 32 (IRVTE)
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
సమూయేలు రెండవ గ్రంథము 22 : 33 (IRVTE)
దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 34 (IRVTE)
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 35 (IRVTE)
నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 36 (IRVTE)
నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 37 (IRVTE)
నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 38 (IRVTE)
నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 39 (IRVTE)
నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 40 (IRVTE)
నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 41 (IRVTE)
నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 42 (IRVTE)
వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 43 (IRVTE)
నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 44 (IRVTE)
నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 45 (IRVTE)
పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 46 (IRVTE)
అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 47 (IRVTE)
యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 48 (IRVTE)
ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 49 (IRVTE)
ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 50 (IRVTE)
కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 51 (IRVTE)
తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.
❮
❯