అపొస్తలుల కార్యములు 14 : 1 (IRVTE)
{ఈకొనియలో పరిచర్య} [PS] ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
అపొస్తలుల కార్యములు 14 : 2 (IRVTE)
అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 3 (IRVTE)
పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
అపొస్తలుల కార్యములు 14 : 4 (IRVTE)
ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు.
అపొస్తలుల కార్యములు 14 : 5 (IRVTE)
యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 6 (IRVTE)
వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. లుస్త్ర, దెర్బే పట్టణాల్లో [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 7 (IRVTE)
లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.
అపొస్తలుల కార్యములు 14 : 8 (IRVTE)
అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.
అపొస్తలుల కార్యములు 14 : 9 (IRVTE)
అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి,
అపొస్తలుల కార్యములు 14 : 10 (IRVTE)
“లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 11 (IRVTE)
ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి,
అపొస్తలుల కార్యములు 14 : 12 (IRVTE)
బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.
అపొస్తలుల కార్యములు 14 : 13 (IRVTE)
పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 14 (IRVTE)
అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి
అపొస్తలుల కార్యములు 14 : 15 (IRVTE)
“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.
అపొస్తలుల కార్యములు 14 : 16 (IRVTE)
ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.
అపొస్తలుల కార్యములు 14 : 17 (IRVTE)
అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 18 (IRVTE)
వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది. [PS]
అపొస్తలుల కార్యములు 14 : 19 (IRVTE)
{లుస్త్రలో పౌలును రాళ్ళతో కొట్టడం} [PS] అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకుని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకుని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.
అపొస్తలుల కార్యములు 14 : 20 (IRVTE)
అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 21 (IRVTE)
వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.
అపొస్తలుల కార్యములు 14 : 22 (IRVTE)
శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు. సంఘాల్లో పెద్దలను నియమించడం. అంతియొకయకు తిరిగి రాక [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 23 (IRVTE)
ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
అపొస్తలుల కార్యములు 14 : 24 (IRVTE)
తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 25 (IRVTE)
వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.
అపొస్తలుల కార్యములు 14 : 26 (IRVTE)
అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.
అపొస్తలుల కార్యములు 14 : 27 (IRVTE)
వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 14 : 28 (IRVTE)
ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: