అపొస్తలుల కార్యములు 15 : 1 (IRVTE)
యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 2 (IRVTE)
పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
అపొస్తలుల కార్యములు 15 : 3 (IRVTE)
కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 4 (IRVTE)
వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం పలికారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు.
అపొస్తలుల కార్యములు 15 : 5 (IRVTE)
కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 6 (IRVTE)
అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు. [PS]
అపొస్తలుల కార్యములు 15 : 7 (IRVTE)
{క్రైస్తవ స్వేచ్ఛకు అనుకూలంగా పేతురు వాదం} [PS] “సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
అపొస్తలుల కార్యములు 15 : 8 (IRVTE)
హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు.
అపొస్తలుల కార్యములు 15 : 9 (IRVTE)
మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు.
అపొస్తలుల కార్యములు 15 : 10 (IRVTE)
కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
అపొస్తలుల కార్యములు 15 : 11 (IRVTE)
ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.” [PS]
అపొస్తలుల కార్యములు 15 : 12 (IRVTE)
{పౌలు బర్నబాల సాక్ష్యం} [PS] అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది. [PS]
అపొస్తలుల కార్యములు 15 : 13 (IRVTE)
{యాకోబు సమీక్ష} [PS] వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి.
అపొస్తలుల కార్యములు 15 : 14 (IRVTE)
యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు.
అపొస్తలుల కార్యములు 15 : 15 (IRVTE)
ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే, [QBR]
అపొస్తలుల కార్యములు 15 : 16 (IRVTE)
‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను. [QBR] మనుషుల్లో మిగిలినవారూ, [QBR] నా నామం ఎవరైతే ధరించారో [QBR] ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా [QBR]
అపొస్తలుల కార్యములు 15 : 17 (IRVTE)
పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ [QBR]
అపొస్తలుల కార్యములు 15 : 18 (IRVTE)
అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’ అని రాసి ఉంది. [PS]
అపొస్తలుల కార్యములు 15 : 19 (IRVTE)
{యూదేతరులను ధర్మశాస్త్రం కిందికి తేకూడదు} [PS] “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా
అపొస్తలుల కార్యములు 15 : 20 (IRVTE)
విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.
అపొస్తలుల కార్యములు 15 : 21 (IRVTE)
ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 22 (IRVTE)
అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, వారిని పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 23 (IRVTE)
వారు ఇలా రాసి పంపారు. “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది,
అపొస్తలుల కార్యములు 15 : 24 (IRVTE)
కొందరు మా దగ్గర నుండి వెళ్ళి తమ బోధతో మిమ్మల్ని గాబరా పెట్టి, మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ ఇవ్వలేదు.
అపొస్తలుల కార్యములు 15 : 25 (IRVTE)
కాబట్టి కొందరిని ఎన్నుకుని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే
అపొస్తలుల కార్యములు 15 : 26 (IRVTE)
మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.
అపొస్తలుల కార్యములు 15 : 27 (IRVTE)
అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 28 (IRVTE)
‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’
అపొస్తలుల కార్యములు 15 : 29 (IRVTE)
అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 30 (IRVTE)
ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు.
అపొస్తలుల కార్యములు 15 : 31 (IRVTE)
వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
అపొస్తలుల కార్యములు 15 : 32 (IRVTE)
యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
అపొస్తలుల కార్యములు 15 : 33 (IRVTE)
వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
అపొస్తలుల కార్యములు 15 : 34 (IRVTE)
వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
అపొస్తలుల కార్యములు 15 : 35 (IRVTE)
అయితే పౌలు బర్నబా అంతియొకయలోనే ఉండి అనేకమందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. [PS]
అపొస్తలుల కార్యములు 15 : 36 (IRVTE)
{పౌలు రెండవ సువార్త ప్రయాణం} [PS] కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 37 (IRVTE)
అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.
అపొస్తలుల కార్యములు 15 : 38 (IRVTE)
అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు.
అపొస్తలుల కార్యములు 15 : 39 (IRVTE)
ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 15 : 40 (IRVTE)
పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,
అపొస్తలుల కార్యములు 15 : 41 (IRVTE)
సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41

BG:

Opacity:

Color:


Size:


Font: