అపొస్తలుల కార్యములు 2 : 1 (IRVTE)
{పెంతెకొస్తు} [PS] పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు.
అపొస్తలుల కార్యములు 2 : 2 (IRVTE)
అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది.
అపొస్తలుల కార్యములు 2 : 3 (IRVTE)
అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి.
అపొస్తలుల కార్యములు 2 : 4 (IRVTE)
అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు.
అపొస్తలుల కార్యములు 2 : 5 (IRVTE)
ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.
అపొస్తలుల కార్యములు 2 : 6 (IRVTE)
ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు.
అపొస్తలుల కార్యములు 2 : 7 (IRVTE)
వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.
అపొస్తలుల కార్యములు 2 : 8 (IRVTE)
మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి?
అపొస్తలుల కార్యములు 2 : 9 (IRVTE)
పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ
అపొస్తలుల కార్యములు 2 : 10 (IRVTE)
ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన
అపొస్తలుల కార్యములు 2 : 11 (IRVTE)
యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.
అపొస్తలుల కార్యములు 2 : 12 (IRVTE)
అందరూ ఆశ్చర్యచకితులై ఎటూ తోచక, “ఇదేమిటో” అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
అపొస్తలుల కార్యములు 2 : 13 (IRVTE)
కొందరైతే వీరు కొత్త సారా తాగి ఉన్నారని ఎగతాళి చేశారు. పేతురు ఉపన్యాసం-యేసే ప్రభువు, క్రీస్తు [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 14 (IRVTE)
అయితే పేతురు ఆ పదకొండు మందితో లేచి నిలబడి బిగ్గరగా వారితో ఇలా అన్నాడు, “యూదయ ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. (1) యోవేలు ప్రవచనం నెరవేర్పు [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 15 (IRVTE)
“మీరనుకున్నట్టు వీరు మద్యపానం చేయలేదు. ఇప్పుడు ఉదయం తొమ్మిదయినా కాలేదు.
అపొస్తలుల కార్యములు 2 : 16 (IRVTE)
యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే, [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 17 (IRVTE)
‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. [QBR] మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. [QBR] మీ యువకులు దర్శనాలు చూస్తారు. [QBR] మీ వృద్ధులు కలలు కంటారు, [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 18 (IRVTE)
ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 19 (IRVTE)
పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 20 (IRVTE)
ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 21 (IRVTE)
ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారంతా పాప విమోచన పొందుతారు’ అని దేవుడు చెబుతున్నాడు. (2) యేసు క్రియలు ఆయనను ప్రభువుగా క్రీస్తుగా నిరూపిస్తున్నాయి [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 22 (IRVTE)
“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
అపొస్తలుల కార్యములు 2 : 23 (IRVTE)
దేవుని స్థిరమైన ప్రణాళికనూ ఆయనకున్న భవిష్య జ్ఞానాన్నీ అనుసరించి ఆయనను అప్పగించడం జరిగింది. ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు.
అపొస్తలుల కార్యములు 2 : 24 (IRVTE)
మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. (3) క్రీస్తు సజీవంగా తిరిగి లేచాక ఆయన రాజరికం గురించి దావీదు ప్రవచనం [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 25 (IRVTE)
“ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు, [QBR] ‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను, [QBR] ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 26 (IRVTE)
నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక ఆనందించింది. [QBR] నా శరీరం కూడా ఆశాభావంతో నిశ్చింతగా ఉంటుంది. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 27 (IRVTE)
ఎందుకంటే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, [QBR] నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు. [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 28 (IRVTE)
నాకు జీవమార్గాలు తెలిపావు. [QBR] నీ ముఖదర్శనంతో నన్ను ఉల్లాసంతో నింపుతావు.’ [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 29 (IRVTE)
“సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.
అపొస్తలుల కార్యములు 2 : 30 (IRVTE)
అతని సమాధి ఇప్పటికీ మన మధ్య ఉంది. అతడు ప్రవక్త కాబట్టి ‘అతని గర్భఫలం నుంచి ఒకడిని అతని సింహాసనం మీద కూర్చోబెడతాను’ అని “దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా శపథం చేసిన సంగతి అతనికి తెలుసు.
అపొస్తలుల కార్యములు 2 : 31 (IRVTE)
క్రీస్తు పాతాళంలో నిలిచి ఉండి పోలేదనీ, ఆయన శరీరం కుళ్ళి పోలేదనీ దావీదు ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. (4) యేసు పునరుత్థానం ఆయనను క్రీస్తుగా ప్రభువుగా నిరూపిస్తున్నది [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 32 (IRVTE)
“ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం.
అపొస్తలుల కార్యములు 2 : 33 (IRVTE)
కాబట్టి ఆయనను దేవుడు తన కుడి స్థానానికి హెచ్చించాడు. ఆయన తన తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆయన వలన పొంది, మీరు చూస్తున్న, వింటున్న ఈ కుమ్మరింపును జరిగించాడు.
అపొస్తలుల కార్యములు 2 : 34 (IRVTE)
దావీదు పరలోకానికి ఆరోహణం కాలేదు. అయితే అతడిలా అన్నాడు, [QBR]
అపొస్తలుల కార్యములు 2 : 35 (IRVTE)
‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకూ [QBR] నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు.’ [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 36 (IRVTE)
“మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి.” (5) ఇశ్రాయేలు ప్రజ ప్రస్తుత కర్తవ్యం [PE][PS]
అపొస్తలుల కార్యములు 2 : 37 (IRVTE)
వారీ మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి, “సోదరులారా, మేమేం చేయాలి” అని పేతురునూ మిగతా అపొస్తలులనూ అడిగారు.
అపొస్తలుల కార్యములు 2 : 38 (IRVTE)
దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.
అపొస్తలుల కార్యములు 2 : 39 (IRVTE)
ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 2 : 40 (IRVTE)
ఇంకా అతడు అనేక రకాలైన మాటలతో సాక్షమిచ్చి, “మీరు ఈ దుష్ట తరం నుండి వేరుపడి రక్షణ పొందండి” అని వారిని హెచ్చరించాడు.
అపొస్తలుల కార్యములు 2 : 41 (IRVTE)
అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.
అపొస్తలుల కార్యములు 2 : 42 (IRVTE)
వీరు అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థనలో కొనసాగారు. [PS]
అపొస్తలుల కార్యములు 2 : 43 (IRVTE)
{ఆది క్రైస్తవ సంఘం} [PS] అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు.
అపొస్తలుల కార్యములు 2 : 44 (IRVTE)
నమ్మినవారంతా కలిసి ఉండి తమకు ఉన్నదంతా ఉమ్మడిగా ఉంచుకున్నారు.
అపొస్తలుల కార్యములు 2 : 45 (IRVTE)
అంతేగాక వారు తమ ఆస్తిపాస్తులను అమ్మేసి, అందరికీ వారి వారి అవసరాలకు తగ్గట్టుగా పంచిపెట్టారు.
అపొస్తలుల కార్యములు 2 : 46 (IRVTE)
ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
అపొస్తలుల కార్యములు 2 : 47 (IRVTE)
ఆనందంతో, కపటం లేని హృదయంతో, వినయంతో కలిసి భోజనాలు చేశారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి మన్నన పొందారు. రక్షణ పొందుతూ ఉన్నవారిని ప్రభువు ప్రతిరోజూ సంఘంలో చేరుస్తున్నాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: