అపొస్తలుల కార్యములు 22 : 1 (IRVTE)
“సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.”
అపొస్తలుల కార్యములు 22 : 2 (IRVTE)
అతడు హెబ్రీ భాషలో మాటలాడడం విన్నప్పుడు వారు నిశ్శబ్దమై పోయారు. అతడు ఈ విధంగా చెప్పాడు, [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 3 (IRVTE)
“నేను కిలికియలోని తార్సు పట్టణంలో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, మన పూర్వీకుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్లో శిక్షణ పొందాను. మీరంతా ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి,
అపొస్తలుల కార్యములు 22 : 4 (IRVTE)
ఈ విశ్వాస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వేయిస్తూ, చనిపోయేదాకా హింసించాను.
అపొస్తలుల కార్యములు 22 : 5 (IRVTE)
ఈ విషయంలో ప్రధాన యాజకుడూ పెద్దలందరూ సాక్షులు. నేను వారి నుండి దమస్కులోని మన సోదరులకు లేఖలు తీసుకుని, అక్కడి విశ్వాసులను కూడా బంధించి శిక్ష వేయడానికి యెరూషలేముకు తీసుకు రావాలని అక్కడికి వెళ్ళాను. [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 6 (IRVTE)
నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
అపొస్తలుల కార్యములు 22 : 7 (IRVTE)
నేను నేల మీద పడి ‘సౌలూ సౌలూ, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని’ నాతో ఒక స్వరం పలకడం విన్నాను.
అపొస్తలుల కార్యములు 22 : 8 (IRVTE)
అందుకు నేను ‘ప్రభూ! నీవెవరివి?’ అని అడగగా ఆయన, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని’ అని నాతో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 22 : 9 (IRVTE)
నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారుగానీ నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు.
అపొస్తలుల కార్యములు 22 : 10 (IRVTE)
అప్పుడు నేను ‘ప్రభూ, నన్నేం చేయమంటావు?’ అని అడిగాను. అప్పుడు ప్రభువు, ‘నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలని నేను నిర్ణయించానో అవన్నీ నీకు తెలుస్తాయి’ అని నాతో అన్నాడు.
అపొస్తలుల కార్యములు 22 : 11 (IRVTE)
ఆ వెలుగు ప్రభావం వలన నేను చూడలేకపోయాను. దాంతో నాతో ఉన్నవారు నన్ను నడిపిస్తూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 12 (IRVTE)
“అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి
అపొస్తలుల కార్యములు 22 : 13 (IRVTE)
‘సోదరా సౌలూ, చూపు పొందు’ అని నాతో చెప్పగానే అదే గడియలో నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
అపొస్తలుల కార్యములు 22 : 14 (IRVTE)
అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
అపొస్తలుల కార్యములు 22 : 15 (IRVTE)
నీవు చూసిన వాటిని గురించీ, విన్న వాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు.
అపొస్తలుల కార్యములు 22 : 16 (IRVTE)
కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 17 (IRVTE)
ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను.
అపొస్తలుల కార్యములు 22 : 18 (IRVTE)
ఆయన నాతో, ‘నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు’ అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 22 : 19 (IRVTE)
అందుకు నేను, ‘ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయించి కొట్టించానని వారికి తెలుసు.
అపొస్తలుల కార్యములు 22 : 20 (IRVTE)
అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను’ అని చెప్పాను.
అపొస్తలుల కార్యములు 22 : 21 (IRVTE)
అందుకు ఆయన ‘వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరికి పంపుతాను’ అని నాతో చెప్పాడు.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 22 (IRVTE)
ఇంతవరకూ అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, “ఇలాటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండి” అని కేకలు వేశారు.
అపొస్తలుల కార్యములు 22 : 23 (IRVTE)
వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు.
అపొస్తలుల కార్యములు 22 : 24 (IRVTE)
ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసుకుని పొండని ఆజ్ఞాపించాడు. [PS]
అపొస్తలుల కార్యములు 22 : 25 (IRVTE)
{రోమా పౌరుని ఆధిక్యత} [PS] వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, “శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?” అని అడిగాడు.
అపొస్తలుల కార్యములు 22 : 26 (IRVTE)
శతాధిపతి ఆ మాట విని సైనికాధికారి దగ్గరికి వెళ్ళి, “నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?” అన్నాడు.
అపొస్తలుల కార్యములు 22 : 27 (IRVTE)
అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలుతో, “నీవు రోమ్ పౌరుడివా? అది నాతో చెప్పు” అన్నాడు.
అపొస్తలుల కార్యములు 22 : 28 (IRVTE)
పౌలు “అవును” అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి” అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 22 : 29 (IRVTE)
కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు. పైగా అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతణ్ణి బంధించినందుకు సైనికాధికారి కూడా భయపడ్డాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 22 : 30 (IRVTE)
మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరాన్ని కచ్చితంగా తెలుసుకోవడం కోసం, సైనికాధికారి అతని సంకెళ్ళు విడిపించి, ప్రధాన యాజకులూ, మహా సభవారంతా సమావేశం కావాలని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: