అపొస్తలుల కార్యములు 27 : 1 (IRVTE)
{రోమ్ నగరానికి ప్రయాణ సన్నాహాలు} [PS] మేము ఓడలో ఇటలీ వెళ్ళాలని నిర్ణయమైంది. వారు పౌలునీ, మరికొందరు ఖైదీలనీ అగస్టస్ సైనిక దళంలోని శతాధిపతి అయిన జూలియస్ అనే అతనికి అప్పగించారు.
అపొస్తలుల కార్యములు 27 : 2 (IRVTE)
ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 3 (IRVTE)
మరునాడు సీదోను వచ్చాం. అప్పుడు జూలియస్ పౌలు మీద దయ చూపించి, అతడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి పరిచర్యలు పొందడానికి అనుమతించాడు.
అపొస్తలుల కార్యములు 27 : 4 (IRVTE)
అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
అపొస్తలుల కార్యములు 27 : 5 (IRVTE)
తరువాత కిలికియకు పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్టణమైన మురకు చేరాం. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 6 (IRVTE)
అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళబోతున్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడను చూసి అందులో మమ్మల్ని ఎక్కించాడు.
అపొస్తలుల కార్యములు 27 : 7 (IRVTE)
చాలా రోజుల పాటు మెల్లగా నడిచి, ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మల్ని అడ్డగించడం చేత క్రేతు చాటుగా సల్మోనే తీరంలో ఓడ నడిపించాము.
అపొస్తలుల కార్యములు 27 : 8 (IRVTE)
అతి కష్టంతో దాన్ని దాటి, ‘సురక్షిత ఆశ్రయాలు’ అనే స్థలానికి చేరాం. దాని పక్కనే లాసియ పట్టణం ఉంది. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 9 (IRVTE)
చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచింది కూడా అప్పటికి గడిచిపోయింది, ప్రయాణం చేయడం ప్రమాదకరంగా మారింది.
అపొస్తలుల కార్యములు 27 : 10 (IRVTE)
అప్పుడు పౌలు, “సోదరులారా, ఈ ప్రయాణం వలన సరకులకు, ఓడకు మాత్రమే కాక మనకూ ప్రాణహానీ, తీవ్ర నష్టం కలగబోతున్నదని నాకనిపిస్తుంది” అని వారిని హెచ్చరించాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 11 (IRVTE)
అయితే శతాధిపతి, పౌలు చెప్పింది కాక నావికుడు, ఓడ యజమాని చెప్పిందే నమ్మాడు.
అపొస్తలుల కార్యములు 27 : 12 (IRVTE)
పైగా చలి కాలం గడపడానికి ఆ రేవు అనుకూలమైనది కాకపోవడం చేత అక్కడ నుండి బయలుదేరి వీలైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది ఆలోచన చెప్పారు. అది క్రేతులోని నైరుతి వాయువ్య దిక్కుల వైపు ఉన్న ఒక రేవు.
అపొస్తలుల కార్యములు 27 : 13 (IRVTE)
అంతేగాక దక్షిణపు గాలి మెల్లగా విసరడంతో వారు తమ ఆలోచన సరైందని భావించి ఫీనిక్సు చేరి, క్రేతు తీరంలో ఓడను నడిపించారు. [PS]
అపొస్తలుల కార్యములు 27 : 14 (IRVTE)
{తుఫాను} [PS] కొంచెం సేపటికి ఊరకులోను అనే పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది.
అపొస్తలుల కార్యములు 27 : 15 (IRVTE)
ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం.
అపొస్తలుల కార్యములు 27 : 16 (IRVTE)
తరువాత కౌద అనే ఒక చిన్న ద్వీపం చాటుగా ఓడ నడిపించాం. బహు కష్టంగా ఓడకు కట్టిన పడవను కాపాడుకోగలిగాం.
అపొస్తలుల కార్యములు 27 : 17 (IRVTE)
దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుకతిప్పకు తగిలి పగిలిపోతుందేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకుపోయారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 18 (IRVTE)
గాలి చాలా తీవ్రంగా కొట్టడం వలన ఆ మరునాడు సరుకులు పారవేయడం మొదలుపెట్టారు.
అపొస్తలుల కార్యములు 27 : 19 (IRVTE)
మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
అపొస్తలుల కార్యములు 27 : 20 (IRVTE)
కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది. [PS]
అపొస్తలుల కార్యములు 27 : 21 (IRVTE)
{పౌలు ప్రోత్సాహ వాక్కులు} [PS] వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది.
అపొస్తలుల కార్యములు 27 : 22 (IRVTE)
ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు.
అపొస్తలుల కార్యములు 27 : 23 (IRVTE)
నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,
అపొస్తలుల కార్యములు 27 : 24 (IRVTE)
‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 27 : 25 (IRVTE)
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను.
అపొస్తలుల కార్యములు 27 : 26 (IRVTE)
అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 27 (IRVTE)
పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి
అపొస్తలుల కార్యములు 27 : 28 (IRVTE)
ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 29 (IRVTE)
అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు.
అపొస్తలుల కార్యములు 27 : 30 (IRVTE)
అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు.
అపొస్తలుల కార్యములు 27 : 31 (IRVTE)
అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 27 : 32 (IRVTE)
వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 33 (IRVTE)
తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు.
అపొస్తలుల కార్యములు 27 : 34 (IRVTE)
కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు.
అపొస్తలుల కార్యములు 27 : 35 (IRVTE)
ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు.
అపొస్తలుల కార్యములు 27 : 36 (IRVTE)
అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.
అపొస్తలుల కార్యములు 27 : 37 (IRVTE)
ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం.
అపొస్తలుల కార్యములు 27 : 38 (IRVTE)
వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 39 (IRVTE)
తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు.
అపొస్తలుల కార్యములు 27 : 40 (IRVTE)
కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 27 : 41 (IRVTE)
కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది.
అపొస్తలుల కార్యములు 27 : 42 (IRVTE)
ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని,
అపొస్తలుల కార్యములు 27 : 43 (IRVTE)
శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ,
అపొస్తలుల కార్యములు 27 : 44 (IRVTE)
మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: