అపొస్తలుల కార్యములు 5 : 1 (IRVTE)
అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు.
అపొస్తలుల కార్యములు 5 : 2 (IRVTE)
భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 3 (IRVTE)
అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు?
అపొస్తలుల కార్యములు 5 : 4 (IRVTE)
అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 5 (IRVTE)
అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది.
అపొస్తలుల కార్యములు 5 : 6 (IRVTE)
అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 7 (IRVTE)
సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది.
అపొస్తలుల కార్యములు 5 : 8 (IRVTE)
అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది.
అపొస్తలుల కార్యములు 5 : 9 (IRVTE)
అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 10 (IRVTE)
వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు.
అపొస్తలుల కార్యములు 5 : 11 (IRVTE)
సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది. [PS]
అపొస్తలుల కార్యములు 5 : 12 (IRVTE)
{సంఘం మహాత్మ్యం} [PS] ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు.
అపొస్తలుల కార్యములు 5 : 13 (IRVTE)
తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే
అపొస్తలుల కార్యములు 5 : 14 (IRVTE)
సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 15 (IRVTE)
పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.
అపొస్తలుల కార్యములు 5 : 16 (IRVTE)
యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు. [PS]
అపొస్తలుల కార్యములు 5 : 17 (IRVTE)
{రెండవ సారి హింసాకాండ} [PS] ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి
అపొస్తలుల కార్యములు 5 : 18 (IRVTE)
అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 19 (IRVTE)
అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి
అపొస్తలుల కార్యములు 5 : 20 (IRVTE)
ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.
అపొస్తలుల కార్యములు 5 : 21 (IRVTE)
వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 22 (IRVTE)
భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి
అపొస్తలుల కార్యములు 5 : 23 (IRVTE)
“చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు.
అపొస్తలుల కార్యములు 5 : 24 (IRVTE)
దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 25 (IRVTE)
అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 5 : 26 (IRVTE)
అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి,
అపొస్తలుల కార్యములు 5 : 27 (IRVTE)
సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు.
అపొస్తలుల కార్యములు 5 : 28 (IRVTE)
ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు. [PS]
అపొస్తలుల కార్యములు 5 : 29 (IRVTE)
{అపొస్తలుల జవాబు} [PS] అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.
అపొస్తలుల కార్యములు 5 : 30 (IRVTE)
మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.
అపొస్తలుల కార్యములు 5 : 31 (IRVTE)
ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.
అపొస్తలుల కార్యములు 5 : 32 (IRVTE)
మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”
అపొస్తలుల కార్యములు 5 : 33 (IRVTE)
వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.
అపొస్తలుల కార్యములు 5 : 34 (IRVTE)
అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు. [PS]
అపొస్తలుల కార్యములు 5 : 35 (IRVTE)
{గమలీయేలు హితవు} [PS] “ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
అపొస్తలుల కార్యములు 5 : 36 (IRVTE)
కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 37 (IRVTE)
అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 38 (IRVTE)
కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది.
అపొస్తలుల కార్యములు 5 : 39 (IRVTE)
దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.” [PE][PS]
అపొస్తలుల కార్యములు 5 : 40 (IRVTE)
వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు.
అపొస్తలుల కార్యములు 5 : 41 (IRVTE)
ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు.
అపొస్తలుల కార్యములు 5 : 42 (IRVTE)
ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42

BG:

Opacity:

Color:


Size:


Font: