అపొస్తలుల కార్యములు 8 : 1 (IRVTE)
ఆ రోజు నుండి యెరూషలేములోని సంఘానికి తీవ్రమైన హింస మొదలైంది.
అపొస్తలుల కార్యములు 8 : 2 (IRVTE)
కాబట్టి, అపొస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాల్లోకి చెదరి పోయారు. భక్తిపరులైన మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి చాలా దుఖించారు.
అపొస్తలుల కార్యములు 8 : 3 (IRVTE)
అయితే సౌలు ప్రతి ఇంట్లోకి చొరబడి, స్త్రీ పురుషులను ఈడ్చుకుపోయి, చెరసాలలో వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్నాడు. [PS]
అపొస్తలుల కార్యములు 8 : 4 (IRVTE)
{మొట్టమొదటి సువార్త ప్రచారకులు} [PS] అయినా, చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు. [PS]
అపొస్తలుల కార్యములు 8 : 5 (IRVTE)
{ఫిలిప్పు పరిచర్య} [PS] ఫిలిప్పు సమరయ ఊరికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు.
అపొస్తలుల కార్యములు 8 : 6 (IRVTE)
జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు.
అపొస్తలుల కార్యములు 8 : 7 (IRVTE)
చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.
అపొస్తలుల కార్యములు 8 : 8 (IRVTE)
అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది. [PS]
అపొస్తలుల కార్యములు 8 : 9 (IRVTE)
{మంత్రగాడు సీమోను వ్యవహారం} [PS] సీమోను అనే ఒకడు అంతకు ముందు అక్కడ మంత్రవిద్య చేస్తూ, తానొక గొప్పవాడినని చెప్పుకొంటూ, సమరయ ప్రజలను మంత్రముగ్ధులను చేసేవాడు.
అపొస్తలుల కార్యములు 8 : 10 (IRVTE)
అల్పులు మొదలుకుని అధికుల వరకూ అందరూ, ‘దేవుని మహాశక్తి అంటే ఇతడే’ అని చెప్పుకొంటూ అతని మాటలు శ్రద్ధగా వినేవారు.
అపొస్తలుల కార్యములు 8 : 11 (IRVTE)
అతడు చాలాకాలం పాటు మంత్రవిద్యలు చేస్తూ వారిని ఆశ్చర్యపరచడం చేత వారతని మాట వినేవారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 12 (IRVTE)
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించీ యేసు క్రీస్తు నామం గురించీ సువార్త ప్రకటిస్తూ ఉంటే, స్త్రీ పురుషులు నమ్మి బాప్తిసం పొందారు.
అపొస్తలుల కార్యములు 8 : 13 (IRVTE)
అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 14 (IRVTE)
సమరయ వారు దేవుని వాక్కు అంగీకరించారని విని, యెరూషలేములోని అపొస్తలులు పేతురు యోహానులను వారి దగ్గరికి పంపారు.
అపొస్తలుల కార్యములు 8 : 15 (IRVTE)
వారు వచ్చి సమరయ విశ్వాసులు పరిశుద్ధాత్మ పొందేలా వారికోసం ప్రార్థన చేశారు.
అపొస్తలుల కార్యములు 8 : 16 (IRVTE)
అంతకు ముందు వారిలో ఎవరి మీదా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామంలో బాప్తిసం మాత్రం పొందారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 17 (IRVTE)
అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు.
అపొస్తలుల కార్యములు 8 : 18 (IRVTE)
అపొస్తలులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ వారి పైకి దిగడం చూసి, సీమోను,
అపొస్తలుల కార్యములు 8 : 19 (IRVTE)
వారికి డబ్బులివ్వ జూపి “నేనెవరి మీద చేతులుంచుతానో వాడు పరిశుద్ధాత్మ పొందేలా ఈ అధికారం నాకివ్వండి” అని అడిగాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 20 (IRVTE)
అందుకు పేతురు, “నీవు ధనమిచ్చి దేవుని వరాన్ని పొందాలనుకున్నావు కాబట్టి నీ వెండి నీతో పాటు నశిస్తుంది గాక.
అపొస్తలుల కార్యములు 8 : 21 (IRVTE)
నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు.
అపొస్తలుల కార్యములు 8 : 22 (IRVTE)
నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
అపొస్తలుల కార్యములు 8 : 23 (IRVTE)
నువ్వు ఘోర దుష్టత్వపు బంధకాల్లో ఉన్నావు. నీ నిలువెల్లా చేదు విషమే నాకు కనిపిస్తున్నది.” అని చెప్పాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 24 (IRVTE)
అప్పుడు సీమోను “మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరు నా కోసం ప్రభువుకు ప్రార్ధించండి” అని జవాబిచ్చాడు.
అపొస్తలుల కార్యములు 8 : 25 (IRVTE)
ఆ తరువాత వారు సాక్షమిచ్చి ప్రభువు వాక్కు బోధించి యెరూషలేము తిరిగి వెళ్తూ, సమరయ ప్రజల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. [PS]
అపొస్తలుల కార్యములు 8 : 26 (IRVTE)
{ఇథియోపియా కోశాధికారితో ఫిలిప్పు} [PS] ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.
అపొస్తలుల కార్యములు 8 : 27 (IRVTE)
అప్పుడు ఇథియోపియా రాణి కందాకే దగ్గర ముఖ్య అధికారిగా ఉంటూ ఆమె ఖజానా అంతటినీ నిర్వహిస్తున్న ఇథియోపియా నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వచ్చాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 28 (IRVTE)
అతడు తిరిగి వెళ్తూ, తన రథం మీద కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
అపొస్తలుల కార్యములు 8 : 29 (IRVTE)
ఆత్మ ఫిలిప్పుతో “నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకో” అని చెప్పాడు.
అపొస్తలుల కార్యములు 8 : 30 (IRVTE)
ఫిలిప్పు పరుగెత్తుకుంటూ వెళ్ళి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథం చదువుతుంటే విని, “మీరు చదివేది మీకు అర్థమవుతుందా?” అని అడిగాడు.
అపొస్తలుల కార్యములు 8 : 31 (IRVTE)
అతడు, “నాకెవరైనా వివరించకపోతే ఎలా అర్థమవుతుంది” అని చెప్పి, రథమెక్కి తన దగ్గర కూర్చోమని ఫిలిప్పును బతిమాలాడు.
అపొస్తలుల కార్యములు 8 : 32 (IRVTE)
ఇతియోపీయుడు చదివే లేఖనభాగం ఏదంటే, [QBR] ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు. [QBR] బొచ్చు కత్తిరించే వాడి దగ్గర [QBR] గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే, [QBR] ఆయన నోరు తెరవలేదు. [QBR]
అపొస్తలుల కార్యములు 8 : 33 (IRVTE)
ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు. [QBR] ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు? [QBR] ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 34 (IRVTE)
అప్పుడు ఆ నపుంసకుడు, “ప్రవక్త చెప్పేది ఎవరి గురించి? తన గురించా లేక వేరొక వ్యక్తిని గురించా? దయచేసి చెప్పు” అని ఫిలిప్పును అడిగాడు.
అపొస్తలుల కార్యములు 8 : 35 (IRVTE)
ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసును గూర్చిన సువార్తను అతనికి బోధించాడు.
అపొస్తలుల కార్యములు 8 : 36 (IRVTE)
వారు దారిలో వెళ్తూ ఉండగానే కొద్దిగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చారు. నపుంసకుడు “ఇక్కడ నీళ్ళున్నాయి! నాకు బాప్తిసమివ్వడానికి ఆటంకమేమిటి?” అని అడిగి రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. [PE][PS]
అపొస్తలుల కార్యములు 8 : 37 (IRVTE)
ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీటిలోకి దిగారు.
అపొస్తలుల కార్యములు 8 : 38 (IRVTE)
అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చాడు.
అపొస్తలుల కార్యములు 8 : 39 (IRVTE)
వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు.
అపొస్తలుల కార్యములు 8 : 40 (IRVTE)
అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: