ఆమోసు 3 : 1 (IRVTE)
దేవునితో ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం
ఆమోసు 3 : 2 (IRVTE)
ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి. లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను.
ఆమోసు 3 : 3 (IRVTE)
సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
ఆమోసు 3 : 4 (IRVTE)
దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?
ఆమోసు 3 : 5 (IRVTE)
నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?
ఆమోసు 3 : 6 (IRVTE)
పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?
ఆమోసు 3 : 7 (IRVTE)
తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.
ఆమోసు 3 : 8 (IRVTE)
సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?
ఆమోసు 3 : 9 (IRVTE)
అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. వాళ్ళతో ఇలా చెప్పండి, “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై దానిలోని గందరగోళాన్ని చూడండి. అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.
ఆమోసు 3 : 10 (IRVTE)
సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.
ఆమోసు 3 : 11 (IRVTE)
కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. నీ రాజ భవనాలను దోచుకుంటాడు.
ఆమోసు 3 : 12 (IRVTE)
యెహోవా చెప్పేదేమిటంటే, “సింహం నోట్లో నుంచి కేవలం రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ కాపరి విడిపించేలాగా సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. కేవలం మంచం మూల, లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”
ఆమోసు 3 : 13 (IRVTE)
యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,
ఆమోసు 3 : 14 (IRVTE)
“ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.
ఆమోసు 3 : 15 (IRVTE)
చలికాలపు భవనాలనూ వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” యెహోవా ప్రకటించేది ఇదే.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15