ద్వితీయోపదేశకాండమ 32 : 1 (IRVTE)
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు.
ద్వితీయోపదేశకాండమ 32 : 2 (IRVTE)
నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.
ద్వితీయోపదేశకాండమ 32 : 3 (IRVTE)
నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి.
ద్వితీయోపదేశకాండమ 32 : 4 (IRVTE)
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 5 (IRVTE)
వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం.
ద్వితీయోపదేశకాండమ 32 : 6 (IRVTE)
బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది?
ద్వితీయోపదేశకాండమ 32 : 7 (IRVTE)
గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 8 (IRVTE)
మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 9 (IRVTE)
యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే.
ద్వితీయోపదేశకాండమ 32 : 10 (IRVTE)
ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 11 (IRVTE)
గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 12 (IRVTE)
యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 13 (IRVTE)
లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 14 (IRVTE)
ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 15 (IRVTE)
* నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్ యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 16 (IRVTE)
వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 17 (IRVTE)
వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 18 (IRVTE)
నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు.
ద్వితీయోపదేశకాండమ 32 : 19 (IRVTE)
యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 20 (IRVTE)
ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు.
ద్వితీయోపదేశకాండమ 32 : 21 (IRVTE)
దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 22 (IRVTE)
నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది.
ద్వితీయోపదేశకాండమ 32 : 23 (IRVTE)
వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 24 (IRVTE)
వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 25 (IRVTE)
బయట కత్తి చావు తెస్తుంది. పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులూ, కన్యలూ, పసికందులూ, నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 26 (IRVTE)
వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 27 (IRVTE)
కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.”
ద్వితీయోపదేశకాండమ 32 : 28 (IRVTE)
ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు.
ద్వితీయోపదేశకాండమ 32 : 29 (IRVTE)
వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే,
ద్వితీయోపదేశకాండమ 32 : 30 (IRVTE)
వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?
ద్వితీయోపదేశకాండమ 32 : 31 (IRVTE)
మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.
ద్వితీయోపదేశకాండమ 32 : 32 (IRVTE)
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు.
ద్వితీయోపదేశకాండమ 32 : 33 (IRVTE)
వారి ద్రాక్షారసం పాము విషం. నాగుపాముల క్రూర విషం.
ద్వితీయోపదేశకాండమ 32 : 34 (IRVTE)
ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా?
ద్వితీయోపదేశకాండమ 32 : 35 (IRVTE)
వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది.
ద్వితీయోపదేశకాండమ 32 : 36 (IRVTE)
బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి, తన సేవకులకు జాలి చూపిస్తాడు, తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 37 (IRVTE)
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది?
ద్వితీయోపదేశకాండమ 32 : 38 (IRVTE)
వారికి ఆధారం లేనప్పుడు చూసి, వారి నైవేద్యాల కొవ్వు తిని, వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి.
ద్వితీయోపదేశకాండమ 32 : 39 (IRVTE)
చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే. దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 40 (IRVTE)
ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 41 (IRVTE)
నేను తళతళలాడే నా కత్తి నూరి, నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను.
ద్వితీయోపదేశకాండమ 32 : 42 (IRVTE)
నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి.
ద్వితీయోపదేశకాండమ 32 : 43 (IRVTE)
ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 44 (IRVTE)
మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 45 (IRVTE)
మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు.
ద్వితీయోపదేశకాండమ 32 : 46 (IRVTE)
తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
ద్వితీయోపదేశకాండమ 32 : 47 (IRVTE)
ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 48 (IRVTE)
అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
ద్వితీయోపదేశకాండమ 32 : 49 (IRVTE)
అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
ద్వితీయోపదేశకాండమ 32 : 50 (IRVTE)
నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
ద్వితీయోపదేశకాండమ 32 : 51 (IRVTE)
ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 52 (IRVTE)
నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52