ద్వితీయోపదేశకాండమ 32 : 1 (IRVTE)
ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. [QBR] భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 2 (IRVTE)
నా ఉపదేశం వానలా కురుస్తుంది. [QBR] నా మాటలు మంచు బిందువుల్లా, [QBR] లేతగడ్డిపై పడే చినుకుల్లా, [QBR] పచ్చికపై కురిసే చిరుజల్లులా, [QBR] మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 3 (IRVTE)
నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. [QBR] మన దేవునికి ఘనత ఆపాదించండి. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 4 (IRVTE)
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. [QBR] ఆయన పని పరిపూర్ణం. [QBR] ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. [QBR] ఆయన నమ్మదగిన దేవుడు. [QBR] ఆయన పక్షపాతం చూపని దేవుడు. [QBR] ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 5 (IRVTE)
వారు తమను తాము చెడగొట్టుకున్నారు. [QBR] వారు ఆయన సంతానం కారు. [QBR] వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 6 (IRVTE)
బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, [QBR] యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? [QBR] ఆయన మీ తండ్రి కాడా? [QBR] ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది? [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 7 (IRVTE)
గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. [QBR] తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. [QBR] మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. [QBR] పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 8 (IRVTE)
మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, [QBR] మానవ జాతులను వేరు పరచినపుడు, [QBR] ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 9 (IRVTE)
యెహోవా వంతు ఆయన ప్రజలే. [QBR] ఆయన వారసత్వం యాకోబు సంతానమే. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 10 (IRVTE)
ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. [QBR] బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. [QBR] తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 11 (IRVTE)
గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ [QBR] రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 12 (IRVTE)
యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. [QBR] వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 13 (IRVTE)
లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. [QBR] పొలాల పంటలు వారికి తినిపించాడు. [QBR] కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 14 (IRVTE)
ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, [QBR] గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, [QBR] మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. [QBR] మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 15 (IRVTE)
[* నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్] యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, [QBR] మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. [QBR] యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. [QBR] తన రక్షణ శిలను నిరాకరించాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 16 (IRVTE)
వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. [QBR] అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 17 (IRVTE)
వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. [QBR] తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, [QBR] మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 18 (IRVTE)
నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, [QBR] నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 19 (IRVTE)
యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, [QBR] తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 20 (IRVTE)
ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. [QBR] వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. [QBR] వాళ్ళు మొండి తరం, [QBR] విశ్వసనీయత లేని పిల్లలు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 21 (IRVTE)
దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. [QBR] తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. [QBR] ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. [QBR] తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 22 (IRVTE)
నా కోపాగ్ని రగులుకుంది. [QBR] పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. [QBR] భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. [QBR] పర్వతాల పునాదులను రగులబెడుతుంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 23 (IRVTE)
వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. [QBR] వారి మీదికి నా బాణాలు వదులుతాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 24 (IRVTE)
వారు కరువుతో అల్లాడతారు. [QBR] ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. [QBR] దుమ్ములో పాకే వాటి విషాన్నీ [QBR] అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 25 (IRVTE)
బయట కత్తి చావు తెస్తుంది. [QBR] పడక గదుల్లో భయం పీడిస్తుంది. [QBR] యువకులూ, కన్యలూ, పసికందులూ, [QBR] నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 26 (IRVTE)
వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. [QBR] వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 27 (IRVTE)
కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, [QBR] వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, [QBR] వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, [QBR] ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.” [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 28 (IRVTE)
ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. [QBR] వాళ్ళలో వివేకమే లేదు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 29 (IRVTE)
వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, [QBR] వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే, [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 30 (IRVTE)
వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, [QBR] యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, [QBR] ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? [QBR] పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 31 (IRVTE)
మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. [QBR] మన శత్రువులే దీనికి సాక్షులు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 32 (IRVTE)
వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. [QBR] అది గొమొర్రా పొలాల్లోనిది. [QBR] వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. [QBR] వాటి గెలలు చేదు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 33 (IRVTE)
వారి ద్రాక్షారసం పాము విషం. [QBR] నాగుపాముల క్రూర విషం. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 34 (IRVTE)
ఇది నా రహస్య ఆలోచన కాదా? [QBR] నా ఖజానాల్లో భద్రంగా లేదా? [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 35 (IRVTE)
వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. [QBR] ప్రతిఫలమిచ్చేది నేనే. [QBR] వారి ఆపద్దినం దగ్గర పడింది. [QBR] వారి అంతం త్వరగా వస్తుంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 36 (IRVTE)
బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, [QBR] వారికి ఆధారం లేనప్పుడు చూసి, [QBR] తన సేవకులకు జాలి చూపిస్తాడు, [QBR] తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 37 (IRVTE)
అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? [QBR] వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 38 (IRVTE)
వారికి ఆధారం లేనప్పుడు చూసి, [QBR] వారి నైవేద్యాల కొవ్వు తిని, [QBR] వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? [QBR] వారు లేచి మీకు సాయపడనివ్వండి. [QBR] వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 39 (IRVTE)
చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. [QBR] నేను తప్ప మరో దేవుడు లేడు. [QBR] చంపేది నేనే, బతికించేది నేనే. [QBR] దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. [QBR] నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 40 (IRVTE)
ఆకాశం వైపు నా చెయ్యెత్తి [QBR] నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 41 (IRVTE)
నేను తళతళలాడే నా కత్తి నూరి, [QBR] నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, [QBR] నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. [QBR] నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 42 (IRVTE)
నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. [PE][PS] నా కత్తి, మాంసం భక్షిస్తుంది! [QBR] చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, [QBR] శత్రువు అధికారులనూ అవి తింటాయి. [QBR]
ద్వితీయోపదేశకాండమ 32 : 43 (IRVTE)
ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. [QBR] వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. [QBR] తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. [QBR] తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 32 : 44 (IRVTE)
మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 45 (IRVTE)
మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 32 : 46 (IRVTE)
తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి.
ద్వితీయోపదేశకాండమ 32 : 47 (IRVTE)
ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. [PE][PS]
ద్వితీయోపదేశకాండమ 32 : 48 (IRVTE)
అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం,
ద్వితీయోపదేశకాండమ 32 : 49 (IRVTE)
అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు.
ద్వితీయోపదేశకాండమ 32 : 50 (IRVTE)
నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు.
ద్వితీయోపదేశకాండమ 32 : 51 (IRVTE)
ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు.
ద్వితీయోపదేశకాండమ 32 : 52 (IRVTE)
నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52

BG:

Opacity:

Color:


Size:


Font: