ద్వితీయోపదేశకాండమ 33 : 1 (IRVTE)
{గోత్రాలు గూర్చి మోషే పలికిన దీవెనలు} [PS] దేవుని సేవకుడు మోషే చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలను ఇలా దీవించాడు. [PE][PS] యెహోవా సీనాయి పర్వతం నుంచి బయలుదేరాడు [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 2 (IRVTE)
శేయీరు నుంచి వారికి ఉదయించాడు. [QBR] ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు [QBR] వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. [QBR] ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 3 (IRVTE)
నిజంగా ఆయన ఆ ప్రజలను ప్రేమిస్తాడు. [QBR] ఆయన పరిశుద్ధులంతా నీ చేతిలో ఉన్నారు, [QBR] వారు నీ పాదాల దగ్గర వంగి నీ మాటలు విన్నారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 4 (IRVTE)
మోషే మనకు ధర్మశాస్త్రాన్ని బోధించాడు, [QBR] యాకోబు సమాజానికి అది వారసత్వం. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 5 (IRVTE)
అప్పుడు ప్రజల అధికారులూ [QBR] ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే [QBR] యెహోవా యెషూరూనులో రాజయ్యాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 6 (IRVTE)
రూబేను చావకూడదు. బతకాలి. [QBR] అయితే వారు కొద్ది మంది మాత్రమే. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 7 (IRVTE)
యూదా గురించి మోషే ఇలా పలికాడు, [QBR] యెహోవా, యూదా ప్రజల మనవి విని, [QBR] మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. [QBR] అతని కోసం పోరాడు. [QBR] అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 8 (IRVTE)
లేవీ గురించి మోషే ఇలా పలికాడు, [QBR] నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి. [QBR] మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు. [QBR] మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 9 (IRVTE)
నేను వాళ్ళని చూడలేదు, అని తన తండ్రి గురించి, [QBR] తన తల్లి గురించి అన్నవాడు అతడు. [QBR] తన సోదరులను లెక్క చెయ్యలేదు. [QBR] తన సొంత కొడుకులను పట్టించుకోలేదు. [QBR] ఎందుకంటే అతడు నీ మాటలను భద్రం చేశాడు. [QBR] నీ నిబంధన పాటించాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 10 (IRVTE)
అతడు యాకోబుకు నీ విధులనూ, [QBR] ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. [QBR] అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. [QBR] నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 11 (IRVTE)
యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, [QBR] అతడు చేసే పనులను అంగీకరించు. [QBR] అతనికి విరోధంగా లేచే వారి, [QBR] అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. [QBR] వాళ్ళు మళ్ళీ లేవరు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 12 (IRVTE)
బెన్యామీను గురించి మోషే ఇలా పలికాడు, [QBR] యెహోవాకు ప్రియుడు. [QBR] ఆయన దగ్గర అతడు క్షేమంగా ఉంటాడు. [QBR] రోజంతా యెహోవా అతనికి అండగా ఉంటాడు. [QBR] అతడు యెహోవా భుజాల మధ్య నివసిస్తాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 13 (IRVTE)
యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. [QBR] యెహోవా అతని భూమిని దీవిస్తాడు [QBR] ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, [QBR] కింద ఉన్న జలాగాధంతో, [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 14 (IRVTE)
సూర్యుని వల్ల వచ్చే శ్రేష్ఠమైన పంటతో, [QBR] నెలనెలా పండే శ్రేష్ఠమైన పండ్లతో, [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 15 (IRVTE)
పురాతన పర్వతాల శ్రేష్ఠ పదార్థాలతో, [QBR] శాశ్వతమైన కొండల శ్రేష్ఠ పదార్థాలతో, [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 16 (IRVTE)
భూమి ఇచ్చే శ్రేష్ఠ పదార్థాలతో, దాని సమృద్ధితో, [QBR] పొదలో కనిపించిన వాడి దయ యోసేపు తల మీదికి వస్తుంది గాక. [QBR] తన సోదరుల్లో రాకుమారుడి నుదిటి మీదకు అది వస్తుంది గాక. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 17 (IRVTE)
తొలిచూలు ఎద్దు ఠీవి అతనికుంది. [QBR] అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు. [QBR] వాటితో అతడు ప్రజలను [QBR] భూదిగంతాలకు తోలివేస్తాడు. [QBR] వీరంతా ఎఫ్రాయింకు చెందిన వేలమంది. [QBR] మనష్షేకు చెందిన వేలమంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 18 (IRVTE)
జెబూలూను గురించి మోషే ఇలా పలికాడు, [QBR] జెబూలూనూ, నువ్వు బయలు దేరేటప్పుడు సంతోషించు. [QBR] ఇశ్శాఖారూ, నువ్వు నీ గుడారాల్లో సంతోషించు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 19 (IRVTE)
వాళ్ళు ప్రజలను పర్వతాలకు పిలుస్తారు. [QBR] అక్కడ సరైన బలులు అర్పిస్తారు. [QBR] వారు సముద్రాల సమృద్ధినీ [QBR] సముద్ర తీర ఇసుకలో దాగిన నిధులనూ తీస్తారు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 20 (IRVTE)
గాదు గురించి మోషే ఇలా పలికాడు. [QBR] గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. [QBR] ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది [QBR] చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 21 (IRVTE)
అతడు తనకోసం శ్రేష్ఠమైన భాగాన్ని చూసుకున్నాడు. [QBR] నాయకుని భాగం అక్కడ కేటాయించబడింది. [QBR] ప్రజల ప్రముఖులు సమకూడినప్పుడు, [QBR] యెహోవా తీర్చిన న్యాయాన్ని అమలు చేశాడు. [QBR] ఇశ్రాయేలు ప్రజల విషయం యెహోవా న్యాయ విధుల ప్రకారం జరిగించాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 22 (IRVTE)
దాను విషయం మోషే ఇలా పలికాడు, [QBR] దాను సింహపు పిల్ల వంటిది [QBR] అది బాషానునుంచి దూకుతుంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 23 (IRVTE)
నఫ్తాలి విషయం మోషే ఇలా పలికాడు. [QBR] కనికరంతో సంతృప్తి నొందిన నఫ్తాలి, [QBR] యెహోవా దీవెనతో నిండిన నఫ్తాలి, [QBR] పశ్చిమ దక్షిణ ప్రాంతాలు నీ స్వాధీనం. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 24 (IRVTE)
ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, [QBR] మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. [QBR] తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. [QBR] తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 25 (IRVTE)
నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. [QBR] నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 26 (IRVTE)
యెషూరూనూ, నీ దేవుణ్ణి పోలిన వాడెవడూ లేడు [QBR] నీ సహాయానికి ఆకాశ వాహనుడుగా ఆయన వస్తాడు [QBR] తన ఘనతతో మేఘాల్లో నుండి వస్తాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 27 (IRVTE)
నిత్య దేవుడు నీకు ఆశ్రయం, [QBR] శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. [QBR] శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. [QBR] నాశనం చెయ్యి! అంటాడు. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 28 (IRVTE)
ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. [QBR] యాకోబు [* యాకోబు నీటి ఊట] నివాసం సురక్షితం. [QBR] ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో [QBR] అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది. [QBR]
ద్వితీయోపదేశకాండమ 33 : 29 (IRVTE)
ఇశ్రాయేలూ! మీరెంత ధన్యులు! [QBR] యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారెవరు? [QBR] ఆయనే మిమ్మల్ని కాపాడే డాలు వంటివాడు, [QBR] ఆయన మీకు ఘనమైన కత్తి వంటివాడు. [QBR] నీ శత్రువులు వణుకుతూ నీకు లోబడతారు [QBR] నువ్వు వారి [† వీపులను] ఎత్తయిన స్థలాలను తొక్కుతావు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: