ప్రసంగి 11 : 1 (IRVTE)
జీవితమనే పెట్టుబడి నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి* నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు . చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది † నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు .
ప్రసంగి 11 : 2 (IRVTE)
దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు.
ప్రసంగి 11 : 3 (IRVTE)
మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది.
ప్రసంగి 11 : 4 (IRVTE)
గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు.
ప్రసంగి 11 : 5 (IRVTE)
స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు.
ప్రసంగి 11 : 6 (IRVTE)
ఉదయాన విత్తనం నాటు. సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు.
ప్రసంగి 11 : 7 (IRVTE)
వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో!
ప్రసంగి 11 : 8 (IRVTE)
ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే.
ప్రసంగి 11 : 9 (IRVTE)
యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. నీ యువదశలో మనసారా సంతోషించు. నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.
ప్రసంగి 11 : 10 (IRVTE)
నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10