ప్రసంగి 12 : 1 (IRVTE)
{అయుష్కాలం} [PS] కష్టకాలం రాకముందే, [QBR2] “జీవితం అంటే నాకిష్టం లేదు” [QBR2] అని నువ్వు చెప్పే కాలం రాకముందే, [QBR2]
ప్రసంగి 12 : 2 (IRVTE)
సూర్య చంద్ర నక్షత్రాల కాంతికి చీకటి కమ్మక ముందే, [QBR2] వాన వెలిసిన తరువాత మబ్బులు మళ్ళీ రాక ముందే, [QBR2] నీ యువ ప్రాయంలోనే నీ సృష్టికర్తను స్మరించుకో. [QBR2]
ప్రసంగి 12 : 3 (IRVTE)
ఆ సమయంలో ఇంటి కావలివారు వణకుతారు. [QBR2] బలంగా ఉండేవారు వంగిపోతారు. [QBR2] తిరగలి విసిరే స్త్రీలు కొద్దిమందే ఉంటారు కాబట్టి పని ఆపేస్తారు. [QBR2] కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు ఇక చూడలేరు. [QBR2]
ప్రసంగి 12 : 4 (IRVTE)
తిరుగటిరాళ్ల శబ్దం ఆగిపోతుంది. [QBR2] వీధి తలుపులు మూసేస్తారు. [QBR2] పిట్ట కూతకు మనుషులు మేలుకుంటారు. [QBR2] అమ్మాయిల పాటల స్వరాలు తగ్గిపోతాయి. [QBR2]
ప్రసంగి 12 : 5 (IRVTE)
ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. [QBR2] బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, [QBR2] మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, [QBR2] సహజమైన కోరికలు అంతరిస్తాయి. [QBR2] అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. [QBR2] ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. [QBR2]
ప్రసంగి 12 : 6 (IRVTE)
వెండి తాడు తెగిపోక ముందే లేదా బంగారు గిన్నె నలిగిపోక ముందే, [QBR2] లేదా నీటి ఊట దగ్గర కుండ పగిలిపోక ముందే, [QBR2] లేదా బావి దగ్గర కప్పీ పగిలి పోక ముందే నీ సృష్టికర్తను స్మరించుకో. [QBR2]
ప్రసంగి 12 : 7 (IRVTE)
మట్టి తాను దేనిలోనింఛి వచ్చిందో ఆ భూమిలో కలిసిపోక ముందే [QBR2] ఆత్మ, దాన్నిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. [QBR2]
ప్రసంగి 12 : 8 (IRVTE)
ప్రసంగి ఇలా అంటున్నాడు. “నీటి ఆవిరి, అంతా అదృశ్యమయ్యే ఆవిరే.”
ప్రసంగి 12 : 9 (IRVTE)
{మానవుని బాధ్యత} [PS] ఈ ప్రసంగి తెలివైనవాడు. అతడు ప్రజలకు జ్ఞానం బోధించాడు. [QBR2] అతడు బాగా చదివి, సంగతులు పరిశీలించి అనేక సామెతలు రాశాడు. [PE][PS]
ప్రసంగి 12 : 10 (IRVTE)
ప్రసంగి చక్కటి మాటలు యథార్థంగా రాయడానికి ప్రయత్నించాడు.
ప్రసంగి 12 : 11 (IRVTE)
తెలివి గల వారి మాటలు ములుకోలల్లాంటివి. ఈ సామెతలు, అనుభవజ్ఞులు సమకూర్చిన మాటల్లాగా, గట్టిగా బిగించి, దిగగొట్టిన మేకుల్లాగా ఒక కాపరి [* ఒక కాపరి సొలొమోను లేక దేవుడు] బోధించినట్టుగా ఉన్నాయి. [PE][PS]
ప్రసంగి 12 : 12 (IRVTE)
కుమారా, ఇంకా ఇతర విషయాల గూర్చి జాగ్రత్తపడు. అంతూ పొంతూ లేని గ్రంథాల రచన. విపరీతంగా చదవడం వలన శరీరం అలిసిపోతుంది. [QBR2]
ప్రసంగి 12 : 13 (IRVTE)
ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. [QBR2] నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. [QBR2] మానవులంతా చేయాల్సింది ఇదే. [QBR2]
ప్రసంగి 12 : 14 (IRVTE)
ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, [QBR2] అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: