ప్రసంగి 5 : 1 (IRVTE)
{ప్రమాణాల వ్యర్ధత} [PS] నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది. [QBR2]
ప్రసంగి 5 : 2 (IRVTE)
దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో. [QBR2] దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, [QBR2] కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి. [QBR2]
ప్రసంగి 5 : 3 (IRVTE)
విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి. [QBR2] ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు. [PE][PS]
ప్రసంగి 5 : 4 (IRVTE)
నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.
ప్రసంగి 5 : 5 (IRVTE)
నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది. [PE][PS]
ప్రసంగి 5 : 6 (IRVTE)
నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు?
ప్రసంగి 5 : 7 (IRVTE)
ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు. [PS]
ప్రసంగి 5 : 8 (IRVTE)
{సంపదులు వ్యర్థం} [PS] ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు.
ప్రసంగి 5 : 9 (IRVTE)
ఏ దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది. [QBR2]
ప్రసంగి 5 : 10 (IRVTE)
డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు. [QBR2] ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు. [QBR2] ఇది కూడా నిష్ప్రయోజనమే. [QBR2]
ప్రసంగి 5 : 11 (IRVTE)
ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు. [QBR2] కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది? [QBR2]
ప్రసంగి 5 : 12 (IRVTE)
కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు. [QBR2] అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు. [PE][PS]
ప్రసంగి 5 : 13 (IRVTE)
సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను. [QBR2] అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది. [QBR2]
ప్రసంగి 5 : 14 (IRVTE)
అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు. [QBR2]
ప్రసంగి 5 : 15 (IRVTE)
వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు. [QBR2] తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు. [QBR2]
ప్రసంగి 5 : 16 (IRVTE)
ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి? [QBR2]
ప్రసంగి 5 : 17 (IRVTE)
ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. [QBR2] అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు. [PE][PS]
ప్రసంగి 5 : 18 (IRVTE)
నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది. [PE][PS]
ప్రసంగి 5 : 19 (IRVTE)
అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి.
ప్రసంగి 5 : 20 (IRVTE)
అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: