ప్రసంగి 6 : 1 (IRVTE)
సూర్యుని కింద ఒక అన్యాయం నేను చూశాను. అది మనుషులకు గొప్ప దురవస్థగా ఉంది.
ప్రసంగి 6 : 2 (IRVTE)
అదేంటంటే, దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధిని, ఘనతను అనుగ్రహిస్తాడు. అతడేం కోరినా అది కొరత లేకుండా ఇస్తాడు. అయితే దాన్ని అనుభవించే శక్తి మాత్రం దేవుడు అతనికి ఇవ్వడు. వేరే వ్యక్తి దాన్ని అనుభవిస్తాడు. ఇది నిష్ప్రయోజనంగా, గొప్ప అన్యాయంగా కనిపిస్తున్నది.
ప్రసంగి 6 : 3 (IRVTE)
ఒకడు వంద మంది పిల్లలను కని, దీర్ఘాయువుతో ఎల్లకాలం జీవించినా, అతడు హృదయంలో సంతృప్తి అంటే తెలియకుండా, చనిపోయిన తరవాత తగిన రీతిలో సమాధికి నోచుకోకపోతే వాడికంటే పుట్టగానే చనిపోయిన పిండం మేలని నేను తలుస్తున్నాను.
ప్రసంగి 6 : 4 (IRVTE)
అది నిర్జీవంగా వచ్చి చీకటి లోకి వెళుతుంది. దాని పేరు ఎవరికీ తెలియదు.
ప్రసంగి 6 : 5 (IRVTE)
అది సూర్యుణ్ణి చూడలేదు, దానికేమీ తెలియదు. అతనికి లేని విశ్రాంతి దానికి ఉంది.
ప్రసంగి 6 : 6 (IRVTE)
అలాటి వ్యక్తి రెండు వేల సంవత్సరాలు బతికినా సంతోషించలేక పోతే అతడు కూడా మిగిలిన అందరూ వెళ్ళే స్థలానికే వెళ్తాడు కదా!
ప్రసంగి 6 : 7 (IRVTE)
మనుషుల కష్టం అంతా తమ నోరు నింపుకోడానికే. అయితే వారి మనస్సుకు తృప్తి కలగదు.
ప్రసంగి 6 : 8 (IRVTE)
మూర్ఖుల కంటే జ్ఞానుల గొప్పతనం ఏమిటి? ఇతరుల ముందు ఎలా జీవించాలో తెలిసిన బీదవాడి గొప్పతనం ఏమిటి?
ప్రసంగి 6 : 9 (IRVTE)
మనస్సు పొందలేని దాని గురించి ఆశపడడం కంటే కంటికి ఎదురుగా ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. ఇది కూడా నిష్ప్రయోజనమే, గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడమే.
ప్రసంగి 6 : 10 (IRVTE)
ఇప్పుడు ఉన్నది చాలా కాలం క్రితం తెలిసిందే. మనుషులు ఎవరు ఎలా ఉంటారో అది పూర్వం తెలిసిన విషయమే. తమకంటే బలవంతుడైన వ్యక్తితో వారు వాదన పెట్టుకోలేరు.
ప్రసంగి 6 : 11 (IRVTE)
పలికిన మాటల్లో వ్యర్థమైనవి చాలా ఉంటాయి. వాటివలన మనుషులకేం ప్రయోజనం?
ప్రసంగి 6 : 12 (IRVTE)
నీడలాగా తమ జీవితాలను వ్యర్థంగా గడిపేసే మనుషులకు తమకేది మంచిదో ఎవరికి తెలుసు? వారు పోయిన తరువాత ఏమి జరుగుతుందో వారికి ఎవరు చెప్పగలరు?
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12