ఎఫెసీయులకు 5 : 1 (IRVTE)
దేవుని ప్రియ సంతానంగా విశ్వాసి ప్రవర్తన కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
ఎఫెసీయులకు 5 : 2 (IRVTE)
క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
ఎఫెసీయులకు 5 : 3 (IRVTE)
మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
ఎఫెసీయులకు 5 : 4 (IRVTE)
కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.
ఎఫెసీయులకు 5 : 5 (IRVTE)
మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
ఎఫెసీయులకు 5 : 6 (IRVTE)
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
ఎఫెసీయులకు 5 : 7 (IRVTE)
కాబట్టి వారికి దూరంగా ఉండండి.
ఎఫెసీయులకు 5 : 8 (IRVTE)
గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
ఎఫెసీయులకు 5 : 9 (IRVTE)
ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
ఎఫెసీయులకు 5 : 10 (IRVTE)
కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
ఎఫెసీయులకు 5 : 11 (IRVTE)
పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
ఎఫెసీయులకు 5 : 12 (IRVTE)
ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
ఎఫెసీయులకు 5 : 13 (IRVTE)
ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
ఎఫెసీయులకు 5 : 14 (IRVTE)
బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
ఎఫెసీయులకు 5 : 15 (IRVTE)
బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
ఎఫెసీయులకు 5 : 16 (IRVTE)
సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
ఎఫెసీయులకు 5 : 17 (IRVTE)
అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
ఎఫెసీయులకు 5 : 18 (IRVTE)
మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
ఎఫెసీయులకు 5 : 19 (IRVTE)
కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
ఎఫెసీయులకు 5 : 20 (IRVTE)
ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
ఎఫెసీయులకు 5 : 21 (IRVTE)
ఆత్మతో నిండిన వారుగా విశ్వాసుల వైవాహిక జీవనం క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
ఎఫెసీయులకు 5 : 22 (IRVTE)
స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
ఎఫెసీయులకు 5 : 23 (IRVTE)
క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
ఎఫెసీయులకు 5 : 24 (IRVTE)
సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
ఎఫెసీయులకు 5 : 25 (IRVTE)
పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
ఎఫెసీయులకు 5 : 26 (IRVTE)
సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
ఎఫెసీయులకు 5 : 27 (IRVTE)
దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
ఎఫెసీయులకు 5 : 28 (IRVTE)
అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
ఎఫెసీయులకు 5 : 29 (IRVTE)
ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
ఎఫెసీయులకు 5 : 30 (IRVTE)
మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
ఎఫెసీయులకు 5 : 31 (IRVTE)
“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
ఎఫెసీయులకు 5 : 32 (IRVTE)
ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
ఎఫెసీయులకు 5 : 33 (IRVTE)
చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33