నిర్గమకాండము 37 : 1 (IRVTE)
నిబంధన మందసం తయారీ
నిర్గ 25:10-22
బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారుచేశాడు. దాని పొడవు రెండు మూరలు, దాని వెడల్పు, ఎత్తు మూరన్నర,
నిర్గమకాండము 37 : 2 (IRVTE)
దాని లోపల, బయటా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
నిర్గమకాండము 37 : 3 (IRVTE)
నిర్గమకాండము 37 : 4 (IRVTE)
దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాడు.
నిర్గమకాండము 37 : 5 (IRVTE)
అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
నిర్గమకాండము 37 : 6 (IRVTE)
మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలలో ఆ మోసే కర్రలు ఉంచాడు.
నిర్గమకాండము 37 : 7 (IRVTE)
అతడు స్వచ్ఛమైన బంగారంతో * ఇది నిబంధన మందసం మూత. కరుణా స్థానం మూత చేశాడు. దాని పొడవు, వెడల్పు మూరన్నర.
నిర్గమకాండము 37 : 8 (IRVTE)
బంగారంతో రెండు కెరూబు ఆకారాలను చేశాడు. కరుణా స్థానం రెండు అంచులను బంగారు రేకులతో అలంకరించాడు.
నిర్గమకాండము 37 : 9 (IRVTE)
రెండు కొనలకు రెండు కెరూబు ఆకారాలను జత చేసి, అవి కరుణా స్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు.
నిర్గమకాండము 37 : 10 (IRVTE)
ఆ రెండు కెరూబులు పైకి రెక్కలు విప్పి, కరుణా స్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణా స్థానాన్ని కప్పుతూ ఒక దానికొకటి ఎదురెదురుగా నిలిచాయి. సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల
నిర్గ 25:23-30
నిర్గమకాండము 37 : 11 (IRVTE)
అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. దాని పొడవు రెండు మూరలు, వెడల్పు ఒక మూర, ఎత్తు మూరన్నర.
నిర్గమకాండము 37 : 12 (IRVTE)
అతడు దాని పైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించి, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు.
నిర్గమకాండము 37 : 13 (IRVTE)
దాని చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైన చుట్టూ బంగారు రేకు అమర్చాడు.
నిర్గమకాండము 37 : 14 (IRVTE)
బల్ల కోసం బంగారంతో నాలుగు గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల నాలుగు కాళ్ళ మూలలకు వాటిని బిగించాడు.
నిర్గమకాండము 37 : 15 (IRVTE)
బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి.
నిర్గమకాండము 37 : 16 (IRVTE)
బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారం రేకులు పొదిగించాడు.
నిర్గమకాండము 37 : 17 (IRVTE)
బల్లమీద ఉండే సామగ్రి, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయ అర్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దీప స్తంభం.
నిర్గమకాండము 37 : 18 (IRVTE)
అతడు దీప స్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాన్నీ, దాని అడుగు భాగాన్నీ, నిలువు భాగాన్నీ బంగారు రేకుతో అలంకరించాడు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు.
నిర్గమకాండము 37 : 19 (IRVTE)
దీపవృక్షం రెండు వైపుల నుండి మూడేసి కొమ్మల చొప్పున ఆరు కొమ్మలు బయలుదేరాయి.
నిర్గమకాండము 37 : 20 (IRVTE)
దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఒక్కో కొమ్మకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలకు ఉన్నాయి.
నిర్గమకాండము 37 : 21 (IRVTE)
దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు ఉన్న నాలుగు కలశాలు ఉన్నాయి.
నిర్గమకాండము 37 : 22 (IRVTE)
దీపవృక్షం నుండి బయలు దేరిన ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల కింద ఒక్కో పువ్వు మొగ్గ ఏకాండంగా ఉన్నాయి.
నిర్గమకాండము 37 : 23 (IRVTE)
వాటి మొగ్గలు, కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించాడు.
నిర్గమకాండము 37 : 24 (IRVTE)
దానికి ఏడు దీపాలు, దాని కత్తెరలు, కత్తెర చిప్పలు, దాని పట్టుకారులు మేలిమి బంగారంతో చేశాడు.
నిర్గమకాండము 37 : 25 (IRVTE)
దీపవృక్షం, దాని సామగ్రి అంతటినీ ఒక తలాంతు 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు. ధూపవేదిక
నిర్గ 30:1-5
నిర్గమకాండము 37 : 26 (IRVTE)
అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేశాడు. దాని పొడవు, వెడల్పు ఒక మూర. అది చదరంగా ఉంది. దాని ఎత్తు రెండు మూరలు, దాని కొమ్ములు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి.
నిర్గమకాండము 37 : 27 (IRVTE)
దాని కప్పుకు, నాలుగు పక్కలకు, దాని కొమ్ములకు స్వచ్ఛమైన బంగారు రేకులు పొదిగించి దానికి పై అంచు చుట్టూ బంగారం అలంకరించాడు.
నిర్గమకాండము 37 : 28 (IRVTE)
ఆ అలంకారం కింద వేదికకు రెండు గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని రెండు పక్కలా రెండు మూలల్లో బంగారం అలంకారం చేశాడు.
నిర్గమకాండము 37 : 29 (IRVTE)
దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారం రేకులు తొడిగించాడు. అభిషేక తైలం, పరిమళ ధూపద్రవ్యాలు
నిర్గ 30:22-38
పవిత్ర అభిషేక తైలాన్నీ, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29