యెహెజ్కేలు 32 : 1 (IRVTE)
{ఫరో గురించి విలాపం} [PS] బబులోను చెరలో ఉన్న కాలంలో, పన్నెండవ నెల మొదటి రోజు యెహోవా నాకీ విషయం తెలియచేశాడు.
యెహెజ్కేలు 32 : 2 (IRVTE)
నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి ఈ మాట చెప్పు. [QBR2] “రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి. [QBR2] నదిలో మొసలివంటి వాడివి. [QBR2] నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.” [PE][PS]
యెహెజ్కేలు 32 : 3 (IRVTE)
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, [QBR2] “నేను, నా వల నీ మీద వేస్తే వాళ్ళు నిన్ను నా వలలో నుంచి అనేక ప్రజల మధ్య బయటికి లాగుతారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 4 (IRVTE)
నేను నిన్ను నేల మీద పడేస్తాను. బయటి పొలంలో పారేస్తాను. [QBR2] గాలిలో ఎగిరే అన్ని రకాల పిట్టలు నీ మీద వాలేలా చేస్తాను. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువులు నీ మాంసాన్ని కడుపారా తింటాయి. [QBR2]
యెహెజ్కేలు 32 : 5 (IRVTE)
నీ మాంసాన్ని పర్వతాల మీద వేస్తాను. పురుగులు పట్టిన నీ కళేబరంతో లోయలను నింపుతాను. [QBR2]
యెహెజ్కేలు 32 : 6 (IRVTE)
నీ రక్తాన్ని పర్వతాల మీద పోస్తాను. [QBR2] వాగులు రక్తంతో నిండుతాయి. [QBR2]
యెహెజ్కేలు 32 : 7 (IRVTE)
నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. [QBR2] సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు. [QBR2]
యెహెజ్కేలు 32 : 8 (IRVTE)
నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. [QBR2] నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. [PE][PS]
యెహెజ్కేలు 32 : 9 (IRVTE)
“నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.
యెహెజ్కేలు 32 : 10 (IRVTE)
నా కత్తి రాజుల ఎదుట ఆడించేటప్పుడు నీ కారణంగా చాలామంది దిగ్భ్రాంతి చెందుతారు. నువ్వు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా ప్రాణభయంతో వణకుతారు.” [PE][PS]
యెహెజ్కేలు 32 : 11 (IRVTE)
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “బబులోను రాజు కత్తి నీ మీదికి వస్తుంది! [QBR2]
యెహెజ్కేలు 32 : 12 (IRVTE)
శూరుల కత్తితో నేను నీ సేనను కూలుస్తాను. వాళ్ళలో ప్రతి శూరుడూ రాజ్యాలను వణికిస్తాడు. [QBR2] వాళ్ళు ఐగుప్తీయుల గర్వం అణచివేస్తారు. దాని సైన్యాన్నంతా నాశనం చేస్తారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 13 (IRVTE)
సమృద్ధిగా ఉన్న నీళ్ల దగ్గరున్న పశువులన్నిటినీ నేను నాశనం చేస్తాను. [QBR2] ప్రజల కాళ్ళు గానీ పశువుల కాళ్ళు గానీ ఆ నీటిని కదిలించలేవు. [QBR2]
యెహెజ్కేలు 32 : 14 (IRVTE)
అప్పుడు నేను వాటి నీళ్లు ఆపి, నూనె పారేలా వాళ్ళ నదులు పారేలా చేస్తాను.” [QBR2] ఇదే యెహోవా ప్రభువు సందేశం. [QBR2]
యెహెజ్కేలు 32 : 15 (IRVTE)
“నేను ఐగుప్తు దేశాన్ని పాడు చేసి అందులో ఉన్నదంతా నాశనం చేసి [QBR2] దాని నివాసులందరినీ నిర్మూలం చేస్తుంటే [QBR2] నేను యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 16 (IRVTE)
ఇది శోకగీతం. రాజ్యాల కూతుర్లు ఈ పాట ఎత్తి పాడతారు. [QBR2] వాళ్ళు ఐగుప్తు మీదా, దాని సమూహమంతటి మీదా ఆ పాట పాడతారు. [QBR2] ఇదే యెహోవా ప్రభువు సందేశం. [PE][PS]
యెహెజ్కేలు 32 : 17 (IRVTE)
పన్నెండవ సంవత్సరం అదే నెల పదిహేనవ రోజు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు. [QBR2]
యెహెజ్కేలు 32 : 18 (IRVTE)
నరపుత్రుడా, ఐగుప్తీయుల సమూహం గురించి విలపించు. [QBR2] భూమి కిందికి పాతాళానికి దిగిపోయిన వాళ్ళ దగ్గరికి, ఆమెనూ గొప్ప రాజ్యాల కూతుళ్ళనూ తోసి వెయ్యి. [QBR2]
యెహెజ్కేలు 32 : 19 (IRVTE)
వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో’ [QBR2]
యెహెజ్కేలు 32 : 20 (IRVTE)
కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 21 (IRVTE)
పాతాళంలోని గొప్ప యోధులు ఐగుప్తు గురించీ దాని మిత్రుల గురించీ ఇలా చెబుతారు, [QBR2] ‘వీళ్లిక్కడికి దిగి వచ్చేశారు! కత్తితో చచ్చిన సున్నతిలేని వాళ్ళ దగ్గర వీరు పడుకుంటారు’ [QBR2]
యెహెజ్కేలు 32 : 22 (IRVTE)
అష్షూరు, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. [QBR2] వాళ్ళంతా కత్తితో చచ్చారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 23 (IRVTE)
దాని సమాధులు పాతాళాగాధంలో ఉన్నాయి. [QBR2] దాని గుంపులు దాని సమాధి చుట్టూ ఉన్నాయి. [QBR2] వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళంతా కత్తితో చచ్చిన వాళ్ళు. [QBR2]
యెహెజ్కేలు 32 : 24 (IRVTE)
ఏలాము, దాని గుంపంతా అక్కడే ఉంది! దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. వాళ్ళంతా కత్తితో చచ్చారు. [QBR2] వాళ్ళంతా సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. వాళ్ళు సున్నతి లేకుండా పాతాళంలోకి దిగిపోయారు. [QBR2] వాళ్ళు సిగ్గు పాలవుతారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 25 (IRVTE)
చచ్చిన వాళ్ళ మధ్య దానికీ దాని సమూహానికీ ఒక పరుపు సిద్ధం చేశారు. దాని చుట్టూ వాళ్ళ సమాధులున్నాయి. [QBR2] వాళ్ళంతా సున్నతి లేకుండా చచ్చారు. [QBR2] వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. పాతాళం లోకి దిగిపోయిన వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సిగ్గు పాలవుతారు. చచ్చిన వాళ్ళ మధ్య ఏలాము ఉంది. [QBR2]
యెహెజ్కేలు 32 : 26 (IRVTE)
అక్కడ మెషెకు తుబాలు దాని గుంపంతా ఉన్నాయి. [QBR2] దాని సమాధులు దాని చుట్టూ ఉన్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు కత్తిపాలయ్యారు. [QBR2]
యెహెజ్కేలు 32 : 27 (IRVTE)
వీళ్ళు సున్నతి లేని వాళ్ళలో పడిపోయిన శూరుల దగ్గర పడుకోరు. [QBR2] వాళ్ళు తమ యుద్ధాయుధాలన్నిటితో పాతాళంలోకి దిగిపోయి, తమ కత్తులను తమ తలల కింద ఉంచుకుని పడుకుంటారు. [QBR2] తమ డాళ్ళను తమతో ఉంచుకుంటారు. వాళ్ళు సజీవుల లోకంలో ఉగ్రత తెచ్చినవాళ్ళు. [QBR2]
యెహెజ్కేలు 32 : 28 (IRVTE)
కాబట్టి, ఐగుప్తు, నువ్వు సున్నతి లేని వాళ్ళ మధ్య నాశనమై, కత్తి పాలైన వాళ్ళ దగ్గర పడుకుంటావు. [PE][PS]
యెహెజ్కేలు 32 : 29 (IRVTE)
అక్కడ ఎదోము, దాని రాజులు దాని అధిపతులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులైనా కత్తి పాలైన వాళ్ళ దగ్గర ఉన్నారు. సున్నతి లేని వాళ్ళ దగ్గర పాతాళంలోకి దిగిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా పడుకున్నారు. [PE][PS]
యెహెజ్కేలు 32 : 30 (IRVTE)
అక్కడ ఉత్తర దేశపు అధిపతులంతా, చచ్చిన వాళ్ళతో దిగిపోయిన సీదోనీయులంతా ఉన్నారు. వాళ్ళు పరాక్రమవంతులై భయం పుట్టించినా సిగ్గు పాలయ్యారు. సున్నతి లేకుండా కత్తి పాలైన వాళ్ళ మధ్య పడుకున్నారు. గోతిలోకి దిగిపోయిన వాళ్ళతో పాటు సిగ్గుపాలయ్యారు. [PE][PS]
యెహెజ్కేలు 32 : 31 (IRVTE)
కత్తి పాలైన ఫరో, అతని వాళ్ళంతా వాళ్ళను చూచి తమ సమూహమంతటిని గురించి ఓదార్పు తెచ్చుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.
యెహెజ్కేలు 32 : 32 (IRVTE)
“సజీవుల లోకంలో వాళ్ళతో నేను ఉగ్రత తెప్పించాను. అయితే సున్నతి లేనివాళ్ళతో కత్తి పాలైనవాళ్ళతో పడుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. [PE]
❮
❯