యెహెజ్కేలు 40 : 1 (IRVTE)
నూతన మందిర నిర్మాణ పనులు మనం బబులోను చెరలోకి వచ్చిన 25 వ సంవత్సరం మొదటి నెల పదో రోజున, అంటే పట్టణం ఆక్రమణకు గురైన 14 వ సంవత్సరం అదే రోజు యెహోవా హస్తం నా మీదకి వచ్చి నన్ను పట్టణానికి తోడుకు పోయాడు.
యెహెజ్కేలు 40 : 2 (IRVTE)
దేవుడు నన్ను తన దర్శనాలతో నింపి ఇశ్రాయేలు దేశంలోకి తెచ్చి, చాలా ఎత్తయిన కొండ మీద ఉంచాడు. దానికి దక్షిణాన పట్టణం లాంటిది ఒకటి నాకు కనబడింది.
యెహెజ్కేలు 40 : 3 (IRVTE)
అక్కడికి ఆయన నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ మెరిసే ఇత్తడిలాగా ఉండి, చేతిలో దారం, కొలిచే కర్ర పట్టుకుని నగర ద్వారంలో నిలబడిన ఒక మనిషి ఉన్నాడు.
యెహెజ్కేలు 40 : 4 (IRVTE)
ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.”
యెహెజ్కేలు 40 : 5 (IRVTE)
తూర్పు గుమ్మపు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు నేను చూసినప్పుడు మందిరం చుట్టూ ప్రాకారం ఉంది. ఆ మనిషి చేతిలో 3 మీటర్ల 20 సెంటి మీటర్ల కొలకర్ర ఉంది. ఆయన ఆ గోడ కొలతలు చూసినప్పుడు దాని వెడల్పు 3 మీటర్ల 20 సెంటి మీటర్ల ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
యెహెజ్కేలు 40 : 6 (IRVTE)
అతడు తూర్పు గుమ్మానికి వచ్చి దాని మెట్లెక్కి గుమ్మపు గడపను కొలిస్తే అది 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
యెహెజ్కేలు 40 : 7 (IRVTE)
కావలి గది పొడవు, వెడల్పులు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, కావలి గదులకు మధ్య 2 మీటర్ల 70 సెంటి మీటర్లు దూరం ఉంది. గుమ్మపు ద్వారం ప్రక్కనుండి మందిరానికి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు దూరం.
యెహెజ్కేలు 40 : 8 (IRVTE)
గుమ్మపు ద్వారానికి, మందిరానికి మధ్య 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఉంది.
యెహెజ్కేలు 40 : 9 (IRVTE)
గుమ్మపు ద్వారం కూడా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు. దాని స్తంభాల వెడల్పు ఒక్కొక్కటి ఒక మీటరు. ఆ ద్వారం మందిరం వైపుకు తిరిగి ఉంది.
యెహెజ్కేలు 40 : 10 (IRVTE)
తూర్పు గుమ్మపు ద్వారం లోపల ఇటు మూడు, అటు మూడు కావలి గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటికీ ఒక్కటే కొలత. వాటి రెండు పక్కల ఉన్న స్తంభాలకు కూడా ఒక్కటే కొలత.
యెహెజ్కేలు 40 : 11 (IRVTE)
ఆ గుమ్మాల ప్రవేశంలో కొలత చూస్తే వాటి వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు, పొడవు ఏడు మీటర్లు.
యెహెజ్కేలు 40 : 12 (IRVTE)
కావలి గదుల ఎదుట రెండు వైపులా అర మీటరు ఎత్తున్న గోడ ఉంది. గదులు మాత్రం రెండు పక్కలా 3 మీటర్ల 20 సెంటి మీటర్లు ఎత్తు ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 13 (IRVTE)
ఒక గది కప్పు నుండి రెండవ గది కప్పువరకూ గుమ్మాల మధ్య కొలిసినప్పుడు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు ఉంది. రెండు వాకిళ్ళ మధ్య కూడా అదే కొలత.
యెహెజ్కేలు 40 : 14 (IRVTE)
32 మీటర్లు ఎడంగా ఒక్కొక్క స్తంభం నిలబెట్టి ఉన్నాయి. గుమ్మం చుట్టూ ఉన్న ఆవరణం స్తంభాల వరకూ వ్యాపించింది.
యెహెజ్కేలు 40 : 15 (IRVTE)
బయటి గుమ్మం నుండి లోపలి గుమ్మం ద్వారపు ఆవరణ వరకూ 27 మీటర్లు.
యెహెజ్కేలు 40 : 16 (IRVTE)
కావలి గదులకు గుమ్మాలకు, లోపల వాటికి మధ్య చుట్టూ ఉన్న గోడలకు ప్రక్కగదులకు కమ్ములు పెట్టిన కిటికీలున్నాయి. గోడలోని స్తంభాలకు కూడా కిటికీలున్నాయి. ప్రతి స్తంభం మీదా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 17 (IRVTE)
బయటి ఆవరణం అతడు నన్ను బయటి ఆవరణంలోకి తీసికెళ్ళాడు. అక్కడ గదులు, చప్టా ఉన్నాయి. చప్టా మీద 30 చిన్నగదులు ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 18 (IRVTE)
ఈ చప్టా గుమ్మాలదాకా ఉండి వాటి వెడల్పుకు సమానంగా ఉంది. ఇది కింది చప్టా.
యెహెజ్కేలు 40 : 19 (IRVTE)
అప్పుడాయన కింది గుమ్మం నుండి లోపలి ఆవరణం వరకూ వెడల్పు కొలిచినప్పుడు అది తూర్పున, ఉత్తరాన 54 మీటర్లు ఉంది.
యెహెజ్కేలు 40 : 20 (IRVTE)
ఉత్తర గుమ్మం తరవాత బయటి ఆవరణం ఉత్తరాన ఉన్న గుమ్మం పొడవు, వెడల్పులు,
యెహెజ్కేలు 40 : 21 (IRVTE)
దానికి రెండు వైపులా ఉన్న మూడేసి కావలి గదులు, వాటి స్తంభాలను వాటి మధ్య గోడలను కొలవగా వాటి కొలత మొదటి గుమ్మం కొలతలాగానే, అంటే 27 మీటర్లు పొడవు, 13 మీటర్ల 50 సెంటి మీటర్లు వెడల్పు ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 22 (IRVTE)
ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న వాటి కిటికీలు, వాటి మధ్యగోడలు తూర్పుద్వారం కొలతకు సమానంగా ఉంది. వాటికి ఏడు మెట్లు ఉన్నాయి. వాటికి ఎదురుగా ఆవరణ ఉంది.
యెహెజ్కేలు 40 : 23 (IRVTE)
ఉత్తర ద్వారానికి, తూర్పు ద్వారానికి, లోపలి ఆవరణకు వెళ్ళే రెండు గుమ్మాలున్నాయి. ఈ రెండు గుమ్మాల మధ్య దూరం అతడు కొలిచినప్పుడు అది 54 మీటర్లు ఉంది.
యెహెజ్కేలు 40 : 24 (IRVTE)
దక్షిణ గుమ్మం అప్పుడాయన నన్ను దక్షిణం వైపుకు తోడుకుని వెళ్ళాడు. అక్కడ గుమ్మం ఒకటి ఉంది. దాని స్తంభాలను మధ్య గోడలను కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
యెహెజ్కేలు 40 : 25 (IRVTE)
వాటికి ఉన్నట్టుగానే దీని మధ్యగోడలకు కూడా చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు 25 మీటర్లు, వెడల్పు పదమూడున్నర మీటర్లు.
యెహెజ్కేలు 40 : 26 (IRVTE)
ఎక్కడానికి ఏడు మెట్లు, వాటికి ఎదురుగా కనిపించే మధ్య గోడలు ఉన్నాయి. దాని స్తంభాలపై కూడా ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 27 (IRVTE)
లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. ఈ గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు.
యెహెజ్కేలు 40 : 28 (IRVTE)
లోపలి ఆవరణ గుమ్మం అతడు దక్షిణ దిశగా లోపలి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దక్షిణపు గుమ్మాన్ని కొలిచాడు. దాని కొలత అదే.
యెహెజ్కేలు 40 : 29 (IRVTE)
దాని కావలి గదుల స్తంభాలు, మధ్య గోడలు పైన చెప్పిన కొలతకు సరిపోయాయి. దానికీ దాని చుట్టూ ఉన్న మధ్యగోడలకూ కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు పదమూడున్నర.
యెహెజ్కేలు 40 : 30 (IRVTE)
చుట్టూ మధ్యగోడల పొడవు పదమూడున్నర, వెడల్పు రెండున్నర మీటర్లు.
యెహెజ్కేలు 40 : 31 (IRVTE)
దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. దాని స్తంభాల మీద ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. వాటికి ఎనిమిది మెట్లున్నాయి.
యెహెజ్కేలు 40 : 32 (IRVTE)
తరవాత ఆయన నన్ను తూర్పు వైపున లోపలి ఆవరణలోకి తీసుకెళ్ళి దాని గుమ్మాన్ని కొలిచాడు. దానికి కూడా పైన చెప్పిన కొలతే.
యెహెజ్కేలు 40 : 33 (IRVTE)
దాని కావలి గదులకు స్తంభాలకు, మధ్యగోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
యెహెజ్కేలు 40 : 34 (IRVTE)
దాని మధ్య గోడలు బయటి ఆవరణం వైపు చూస్తున్నాయి. వాటి స్తంభాల మీద రెండు వైపులా ఖర్జూరపుచెట్లు చెక్కి ఉన్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
యెహెజ్కేలు 40 : 35 (IRVTE)
అప్పుడతడు ఉత్తరపు గుమ్మానికి నన్ను తీసుకెళ్ళి దాని కొలిచినప్పుడు అదే కొలత ఉంది.
యెహెజ్కేలు 40 : 36 (IRVTE)
దాని కావలి గదులకు, స్తంభాలకు, దాని మధ్య గోడలకు అదే కొలత. దానికి, దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలున్నాయి. దాని పొడవు 27 మీటర్లు, వెడల్పు 13 మీటర్ల 50 సెంటి మీటర్లు.
యెహెజ్కేలు 40 : 37 (IRVTE)
అటూ ఇటూ ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్న దాని స్తంభాలు బయటి ఆవరణం వైపుకు చూస్తున్నాయి. ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
యెహెజ్కేలు 40 : 38 (IRVTE)
మందిర వాకిలి దాని ఉపకరణాలు ప్రతి గుమ్మం స్తంభాల దగ్గర వాకిలి ఉన్న ఒక గది ఉంది. ఆ గదుల్లో దహనబలి పశువుల మాంసం కడుగుతారు.
యెహెజ్కేలు 40 : 39 (IRVTE)
గుమ్మపు మంటపాల్లో రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. వీటి మీద దహనబలి, పాప పరిహారార్థ బలి, అపరాధపరిహారార్థ బలులకు పశువులను వధిస్తారు.
యెహెజ్కేలు 40 : 40 (IRVTE)
గుమ్మాల వాకిలి దగ్గర ఉత్తరాన మెట్లు ఎక్కే చోట రెండు వైపులా రెండేసి బల్లలున్నాయి. అంటే గుమ్మపు రెండు వైపులా నాలుగేసి బల్లలున్నాయి. వీటి పైన పశువులను వధిస్తారు.
యెహెజ్కేలు 40 : 41 (IRVTE)
దహనబలి పశువులు మొదలైన వాటిని వధించడానికి వాడే ఉపకరణాలు ఉంచే ఎనిమిది బల్లలు ఈ వైపు నాలుగు, ఆ వైపు నాలుగు మెట్ల దగ్గర ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 42 (IRVTE)
వాటి పొడవు సుమారు ఒక మీటరు, వెడల్పు సుమారు ఒక మీటరు, ఎత్తు అర మీటరు. వాటిని రాతితో మలిచారు.
యెహెజ్కేలు 40 : 43 (IRVTE)
ఈ బల్లల మీద బలి అర్పణ మాంసాన్ని ఉంచుతారు. చుట్టూ ఉన్న గోడకు ఒక అడుగు పొడుగున్న మేకులు తగిలించి ఉన్నాయి.
యెహెజ్కేలు 40 : 44 (IRVTE)
లోపటి గుమ్మం బయట, లోపలి ఆవరణంలో రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు, మరొకటి దక్షిణం నుండి ఉత్తరం వైపుకు చూస్తున్నాయి.
యెహెజ్కేలు 40 : 45 (IRVTE)
అప్పుడతడు నాతో ఇలా అన్నాడు. “దక్షిణం వైపు చూసే గది మందిరానికి కావలి కాసే యాజకులది.
యెహెజ్కేలు 40 : 46 (IRVTE)
ఉత్తరం వైపుకు చూసే గది బలిపీఠానికి కావలి కాసే యాజకులది. వీరు లేవీయుల్లో సాదోకు సంతతికి చెంది యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు.”
యెహెజ్కేలు 40 : 47 (IRVTE)
అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది.
యెహెజ్కేలు 40 : 48 (IRVTE)
అతడు మందిర మంటపంలోకి నన్ను తీసుకొచ్చి మంటప స్తంభాలను ఒక్కొక్కటీ కొలిచినప్పుడు అది రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు ఉన్నాయి. దాని ప్రవేశ ద్వారం వెడల్పు 7 మీటర్లు ఉంది. దానికి రెండు వైపులా ఉన్న గోడ మందం 1 మీటర్ 60 సెంటి మీటర్లు.
యెహెజ్కేలు 40 : 49 (IRVTE)
మంటపం పొడవు 11 మీటర్లు. దాని వెడల్పు సుమారు 6 మీటర్లు. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దానికి ఇరువైపులా స్తంభాలున్నాయి.
❮
❯