ఎజ్రా 10 : 1 (IRVTE)
ప్రజలు పాపాలను ఒప్పుకొని ఎజ్రాకు విధేయులయ్యారు ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.
ఎజ్రా 10 : 2 (IRVTE)
అప్పుడు ఏలాము మనుమడు, యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు. “మేము దేశంలో ఉన్న పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా మా దేవుని దృష్టికి పాపం చేశాం. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ ప్రవర్తన మార్చుకొంటారన్న నిరీక్షణ ఉంది.
ఎజ్రా 10 : 3 (IRVTE)
ఈ పని ధర్మశాస్త్ర నియమం ప్రకారం జరిగేలా నాయకుడవైన నువ్వు, దేవుడంటే భయపడేవారూ చెబుతున్నట్టు మేము పెళ్లి చేసుకొన్న భార్యలను, వారికి పుట్టిన పిల్లలను విడిచిపెట్టి, పంపివేస్తామని మన దేవుని పేరట ఒట్టు పెట్టుకుంటాం.
ఎజ్రా 10 : 4 (IRVTE)
ఈ పని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఈ పని మొదలు పెట్టు. మేమంతా నీతోనే ఉంటాం.”
ఎజ్రా 10 : 5 (IRVTE)
ఎజ్రా లేచి, ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయులంతా ఆ మాట ప్రకారమే నడుచుకొంటామని వారి చేత ప్రమాణం చేయించాడు. వారంతా ప్రమాణం చేసిన తరువాత,
ఎజ్రా 10 : 6 (IRVTE)
ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి, ఎల్యాషీబు కొడుకు యోహానాను గదిలోకి వెళ్ళాడు. అక్కడ అతడు చెరకు లోనైన వారి అపరాధాలను బట్టి రోదిస్తూ, భోజనం చేయకుండా, నీళ్ళు తాగకుండా ఉండిపోయాడు.
ఎజ్రా 10 : 7 (IRVTE)
చెరనుండి తిరిగి వచ్చిన వారంతా యెరూషలేములో తప్పక సమకూడాలని యూదా దేశమంతటా, యెరూషలేము పట్టణంలో దండోరా వేశారు.
ఎజ్రా 10 : 8 (IRVTE)
ప్రధానులు, పెద్దలు నిర్ణయించినట్టుగా మూడు రోజుల్లోగా ఎవరైనా రాకపోతే వారి ఆస్తులు జప్తు చేసి, వాటిని దేవుని మందిరపు ఆస్తిగా ప్రకటించాలని, వాళ్ళను సమాజం నుండి బహిష్కరించాలని తీర్మానం చేశారు.
ఎజ్రా 10 : 9 (IRVTE)
యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.
ఎజ్రా 10 : 10 (IRVTE)
అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇలా అన్నాడు. “మీరు ఆజ్ఞను అతిక్రమించి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకుని మన జాతి పాపాన్ని ఇంకా అధికం చేశారు.
ఎజ్రా 10 : 11 (IRVTE)
కాబట్టి ఇప్పుడు మీ తండ్రుల దేవుడైన యెహోవా ముందు మీ పాపాలను ఒప్పుకుని, ఆయనకు నచ్చే విధంగా ప్రవర్తించడానికి సిద్ధపడి, పరాయి దేశపు స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకుని ఉండండి.”
ఎజ్రా 10 : 12 (IRVTE)
అప్పుడు అక్కడ సమకూడిన వారంతా బిగ్గరగా ఇలా అన్నారు. “నువ్వు చెప్పినట్టుగా మేము తప్పకుండా చేయవలసి ఉంది.
ఎజ్రా 10 : 13 (IRVTE)
అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.
ఎజ్రా 10 : 14 (IRVTE)
మన పట్టణాల్లో ఎవరెవరు పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నారో వాళ్ళంతా గడువులోగా రావాలి. ఈ విషయంలో మాపై దేవునికి వచ్చిన తీవ్రమైన కోపం తొలగిపోయేలా ప్రతి పట్టణాల్లోని పెద్దలు, న్యాయాధిపతులు వాళ్ళతో ఉండాలి.”
ఎజ్రా 10 : 15 (IRVTE)
ఈ పని జరిగించడానికి అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యా, వాళ్లకు సహాయకులుగా మెషుల్లాము, లేవీ గోత్రికుడు షబ్బెతైలను నియమించారు.
ఎజ్రా 10 : 16 (IRVTE)
చెరనుంచి వచ్చినవారు ఆ క్రమం ప్రకారం చేశారు. యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులును వారి తండ్రుల ఇంటి పేర్ల ప్రకారం ఎన్నుకున్నాడు. పదవ నెల మొదటి రోజున ఈ విషయాన్ని గూర్చి పరిశీలించడం మొదలుపెట్టారు.
ఎజ్రా 10 : 17 (IRVTE)
మొదటి నెల మొదటి రోజునాటికి పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసికొన్న వారందరి వ్యవహారం పరిష్కారం చేశారు.
ఎజ్రా 10 : 18 (IRVTE)
దోషులు యాజకుల వంశంలో పరాయి దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్న వారు ఎవరంటే, యోజాదాకు కొడుకు యేషూవ వంశంలో, అతని సహోదరుల్లో మయశేయా, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా.
ఎజ్రా 10 : 19 (IRVTE)
వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు.
ఎజ్రా 10 : 20 (IRVTE)
ఎజ్రా 10 : 21 (IRVTE)
ఇమ్మేరు వంశంలో హనానీ, జెబద్యా.
ఎజ్రా 10 : 22 (IRVTE)
హారీం వంశంలో మయశేయా, ఏలీయా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.
ఎజ్రా 10 : 23 (IRVTE)
పషూరు వంశంలో ఎల్యో యేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.
ఎజ్రా 10 : 24 (IRVTE)
లేవీ గోత్రం నుండి యోజాబాదు, షిమీ కెలిథా అనే పేరున్న కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.
ఎజ్రా 10 : 25 (IRVTE)
గాయక బృందానికి చెందిన ఎల్యాషీబు, ద్వారపాలకుల నుండి షల్లూము, తెలెము, ఊరి అనేవాళ్ళు.
ఎజ్రా 10 : 26 (IRVTE)
ఇశ్రాయేలీయుల్లో పరోషు వంశం నుండి రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.
ఎజ్రా 10 : 27 (IRVTE)
ఏలాము వంశంలో మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.
ఎజ్రా 10 : 28 (IRVTE)
జత్తూ వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.
ఎజ్రా 10 : 29 (IRVTE)
బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.
ఎజ్రా 10 : 30 (IRVTE)
బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.
ఎజ్రా 10 : 31 (IRVTE)
పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
ఎజ్రా 10 : 32 (IRVTE)
హారిము వంశంలో ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా,
ఎజ్రా 10 : 33 (IRVTE)
హాషుము వంశంలో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ.
ఎజ్రా 10 : 34 (IRVTE)
ఎజ్రా 10 : 35 (IRVTE)
బానీ వంశంలో మయదై, అమ్రాము, ఊయేలు.
ఎజ్రా 10 : 36 (IRVTE)
బెనాయా, బేద్యా, కెలూహు.
ఎజ్రా 10 : 37 (IRVTE)
వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు.
ఎజ్రా 10 : 38 (IRVTE)
మత్తన్యా, మత్తెనై, యహశావు.
ఎజ్రా 10 : 39 (IRVTE)
బానీ, బిన్నూయి, షిమీ.
ఎజ్రా 10 : 40 (IRVTE)
షిలెమ్యా, నాతాను, అదాయా.
ఎజ్రా 10 : 41 (IRVTE)
మక్నద్బయి, షామై, షారాయి.
ఎజ్రా 10 : 42 (IRVTE)
అజరేలు, షెలెమ్యా, షెమర్యా.
ఎజ్రా 10 : 43 (IRVTE)
షల్లూము, అమర్యా, యోసేపు.
ఎజ్రా 10 : 44 (IRVTE)
నెబో వంశానికి చెందిన యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనేవాళ్ళు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు. ఈ స్త్రీలలో కొందరు పిల్లలను కూడా కన్నారు. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు.* వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకొన్నవారు, వారిని వారి పిల్లలతో దూరముగా ఉంచారు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44