ఆదికాండము 10 : 1 (IRVTE)
నోవహు కుమారుల సంతతి
1దిన 1:5-23
ఆదికాండము 10 : 2 (IRVTE)
నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు. యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
ఆదికాండము 10 : 3 (IRVTE)
గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
ఆదికాండము 10 : 4 (IRVTE)
యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
ఆదికాండము 10 : 5 (IRVTE)
వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
ఆదికాండము 10 : 6 (IRVTE)
హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
ఆదికాండము 10 : 7 (IRVTE)
కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
ఆదికాండము 10 : 8 (IRVTE)
కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
ఆదికాండము 10 : 9 (IRVTE)
అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
ఆదికాండము 10 : 10 (IRVTE)
షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు* బబులోను , ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
ఆదికాండము 10 : 11 (IRVTE)
ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
ఆదికాండము 10 : 12 (IRVTE)
నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
ఆదికాండము 10 : 13 (IRVTE)
మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
ఆదికాండము 10 : 14 (IRVTE)
పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
ఆదికాండము 10 : 15 (IRVTE)
కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
ఆదికాండము 10 : 16 (IRVTE)
హివ్వీ, అర్కీయు, సినీయ,
ఆదికాండము 10 : 17 (IRVTE)
అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
ఆదికాండము 10 : 18 (IRVTE)
ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
ఆదికాండము 10 : 19 (IRVTE)
కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
ఆదికాండము 10 : 20 (IRVTE)
వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
ఆదికాండము 10 : 21 (IRVTE)
యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
ఆదికాండము 10 : 22 (IRVTE)
షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
ఆదికాండము 10 : 23 (IRVTE)
అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
ఆదికాండము 10 : 24 (IRVTE)
అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
ఆదికాండము 10 : 25 (IRVTE)
ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
ఆదికాండము 10 : 26 (IRVTE)
యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
ఆదికాండము 10 : 27 (IRVTE)
హదోరము, ఊజాలు, దిక్లా,
ఆదికాండము 10 : 28 (IRVTE)
ఓబాలు, అబీమాయెలు, షేబ,
ఆదికాండము 10 : 29 (IRVTE)
ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
ఆదికాండము 10 : 30 (IRVTE)
వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
ఆదికాండము 10 : 31 (IRVTE)
వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
ఆదికాండము 10 : 32 (IRVTE)
తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32