ఆదికాండము 11 : 1 (IRVTE)
{బాబెల్ గోపురం} [PS] అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
ఆదికాండము 11 : 2 (IRVTE)
వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు [* షీనారు అని రాసిన చోటల్లా బబులోను అని అర్థం ] ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. [PE][PS]
ఆదికాండము 11 : 3 (IRVTE)
వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
ఆదికాండము 11 : 4 (IRVTE)
వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు. [PE][PS]
ఆదికాండము 11 : 5 (IRVTE)
యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
ఆదికాండము 11 : 6 (IRVTE)
యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
ఆదికాండము 11 : 7 (IRVTE)
కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు. [PE][PS]
ఆదికాండము 11 : 8 (IRVTE)
ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
ఆదికాండము 11 : 9 (IRVTE)
అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు. [PS]
ఆదికాండము 11 : 10 (IRVTE)
{షేము సంతతి} [PS] షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
ఆదికాండము 11 : 11 (IRVTE)
షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 12 (IRVTE)
అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
ఆదికాండము 11 : 13 (IRVTE)
అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 14 (IRVTE)
షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
ఆదికాండము 11 : 15 (IRVTE)
షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 16 (IRVTE)
ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
ఆదికాండము 11 : 17 (IRVTE)
ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 18 (IRVTE)
పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
ఆదికాండము 11 : 19 (IRVTE)
పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 20 (IRVTE)
రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
ఆదికాండము 11 : 21 (IRVTE)
రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 22 (IRVTE)
సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
ఆదికాండము 11 : 23 (IRVTE)
సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు. [PE][PS]
ఆదికాండము 11 : 24 (IRVTE)
నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
ఆదికాండము 11 : 25 (IRVTE)
నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు. [PS]
ఆదికాండము 11 : 26 (IRVTE)
{తెరహు వంశం} [PS] తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. [PE][PS]
ఆదికాండము 11 : 27 (IRVTE)
తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
ఆదికాండము 11 : 28 (IRVTE)
హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు. [PE][PS]
ఆదికాండము 11 : 29 (IRVTE)
అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
ఆదికాండము 11 : 30 (IRVTE)
శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు. [PE][PS]
ఆదికాండము 11 : 31 (IRVTE)
తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
ఆదికాండము 11 : 32 (IRVTE)
తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: